'కైలాస'లో తేలిన నిత్యానంద: ప్రత్యేక పాస్ పోర్టు..జాతీయ చిహ్నంగా ఆయన రూపం!
- December 04, 2019
బెంగళూరు: అత్యాచార ఆరోపణలను ఎదుర్కొంటున్న వివాదాస్పద స్వామి నిత్యానంద.. ఓ సొంత దేశాన్నే సృష్టించుకున్నాడు. ఈక్వెడార్ సమీపంలోని ఓ చిన్న ద్వీపంలో తిష్ట వేశాడు. ఆ ద్వీపాన్ని హిందూ దేశంగా ప్రకటించాడు. ఆ దేశం పేరు కైలాస. దీనికోసం ఓ ప్రత్యేక వెబ్ సైట్ ను రూపొందించారు. https://www.kailaasa.org. కైలాస దేశానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇందులో పొందుపరిచారు. అత్యాచార ఆరోపణలపై గుజరాత్ హైకోర్టులో పిటీషన్ దాఖలైన తరువాత కనిపించకుండా పోయిన నిత్యానంద.. ఆ దేశంలో తేలాడు.
ఆ దేశానికి వెళ్లాలంటే.. ప్రత్యేక పాస్ పోర్టు..
నిత్యానంద సృష్టించినట్లుగా చెబుతోన్న ఆ దేశానికి వెళ్లాలంటే ప్రత్యేక పాస్ పోర్ట్ అవసరం అవుతుందట. జాతీయ పతాకాన్ని, జాతీయ ధ్వజాన్ని సైతం రూపొందించుకున్నారు. తాను ధ్యానంలో కూర్చున్న ఫొటోను జాతీయ చిహ్నంగా ప్రకటించారు. 'కైలాస' దేశాన్ని గుర్తించాలని కోరుతూ నిత్యానంద ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేయనున్నట్లు ఆ వెబ్ సైట్ లో పొందుపరిచారు. ప్రపంచంలో హిందూ దేశాల సంఖ్య తగ్గుతోందని, అందుకే తాను కైలాస పేరుతో ప్రత్యేకంగా ఓ దేశాన్ని సృష్టించాల్సి వచ్చిందని నిత్యానంద ఉటంకించినట్లు వెబ్ సైట్ చెబుతోంది.
పౌరసత్వం కావాలంటే..
కైలాస దేశంలో పౌరసత్వం పొందాలంటే భారీగా విరాళాలను సమర్పించుకోవాల్సి ఉంటుందనే నిబంధన పెట్టారు. ఎంత భారీగా విరాళాలను అందజేస్తే.. అంత విలాసవంతంగా ఆ దేశంలో జీవనాన్ని గడప వచ్చట. ఇతర దేశాలకు చెందిన వారు అక్కడ భూములను సైతం కొనుగోలు చేయడానికి వీలు కల్పించినట్లు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ కు అనుగుణంగా భూముల ధరలను నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అన్నీ ఉచితమే..
కైలాస దేశంలో ఆకలి అనేదే తెలియకుండా చేస్తామని వెబ్ సైట్ పేర్కొన్నారు. విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామని, అన్నార్తులకు భోజనాన్ని ఉచితంగా అందజేస్తామని వెల్లడించారు. ఆధ్యాత్మిక భావనలతో కూడిన విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలను కల్పించుకోవడానికి మాత్రమే తమ దేశ పౌరులు పన్నులను చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఐక్యరాజ్య సమితి నుంచి గుర్తింపు లభించిన వెంటనే అనేక విప్లవాత్మక చర్యలను చేపట్టబోతున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?