బ్రేకింగ్..అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుండి తప్పుకున్న కమలా హారిస్
- December 04, 2019
వాషింగ్టన్: భారతీయ సంతతికి చెందిన కమలా హారిస్ డెమక్రాట్ల తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం తీవ్రంగా పోటిపడ్డారు. అయితే కమలహారిస్ ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్న భయంతో బరిలో నుంచి తప్పుకున్నారు. అమెరికాలో సెనేటర్‌గా ఎంపికైన తొలిభారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన కమలా హారిస్ ఒకానొక దశలో డెమక్రటిక్ అభ్యర్థుల్లో కీలకనేతగా మారారు. తదుపరి ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ తో తలపడేది ఆమేనన్న భావన కలిగిం చారు. కానీ ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా బరి నుంచి తప్పుకున్నారు. నిన్నటితో ఎన్నికల ప్రచారాన్ని ముగించిన కమల తొలుత ఈ విషయాన్ని తన సీనియర్ సిబ్బందికి వెల్లడించారు. అనంతరం తన మద్దతుదారులకు ట్వీట్ చేశారు. 'నేను బిలియనీర్ కాదు. ప్రచారం కొనసాగుతున్న కొద్దీ దీటైన పోటీ ఇచ్చేందుకు సరిపడా నిధులు సమకూర్చుకోవడం కష్టంగా కనిపిస్తోంది. అందుకే ప్రచారాన్ని నిలిపివేసి పోటీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. నా మద్దతుదారుతలకు ఇది చాలా విచారకరమైన సమాచారమే. అయితే ఒకటి మాత్రం మీకు స్పష్టంగా చెప్పదల్చుకున్నా. ప్రజల కోసం నిత్యం పోరాటం చేస్తూనే ఉంటాను' అని ట్విట్టర్ మెసేజ్ లో పేర్కొన్నారు.
న్యూయార్క్ మేయర్ మైక్ బ్లూమ్ బర్గ్ రంగంలోకి దిగిన తర్వాత కమలకు మద్దతు తగ్గుతూ వచ్చిందని, దీన్ని గుర్తిం చడం, మరోవైపు ఆర్థిక సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందన్న భావన కలగడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు. కాగా, కమలా హారిస్ బరిలో నుంచి తప్పుకోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యంగ్యం గా ట్వీట్ చేశారు. 'ఇది చాలా బాధ కలిగించే అంశం కమలా. నిన్ను మేము కోల్పోతున్నాం' అంటూ వెటకారంగా వ్యాఖ్యానించారు. అయితే 'అధ్యక్షుడు ట్రంప్ చింతించాల్సిన అవసరం లేదు. మీపై జరిగే అభిశంసన విచారణలో కలుస్తా' అంటూ అదే టెంపరితనంతో కమల సమాధానమిచ్చారు. ఉక్రెయిన్ అధ్యక్షుడితో ఫోన్ సంభాషణ విషయంలో ట్రంప్ ప్రస్తుతం అభిశంసన ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు