జాయేద్ మరియు గాంధీ చిత్రాలతో ప్రత్యేక పోస్టల్ కవర్ ను విడుదల చేసిన భారత్
- December 04, 2019
యూఏఈ 48 వ జాతీయ దినోత్సవం సందర్భంగా ఆయా దేశాల జాతీయ జెండాలతో కూడిన షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ మరియు మహాత్మా గాంధీ చిత్రాలతో ప్రత్యేక పోస్టల్ కవర్ ను భారత ప్రభుత్వం విడుదల చేసింది. న్యూ ఢిల్లీ లోని తాజ్ ప్యాలెస్‌లో భారత-యూఏఈ రాయబారి డాక్టర్ అహ్మద్ అల్ బన్నా ఈ పోస్టల్ కవర్ ను ఆవిష్కరించారు. అనంతరం 'ఫిలేట్లీ' ఆధిపత్య అంశంగా అహ్మద్ అల్ బన్నా ఏర్పాటు చేసిన రిసెప్షన్ కొనసాగింది. రిసెప్షన్లో ముఖ్యఅతిథిగా విచ్చేసిన భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్, డాక్టర్ అల్ బన్నా ఏర్పాటు చేసిన అరుదైన స్టాంపులను చూడటం జరిగింది.
కేరళకు చెందిన ప్రముఖ స్టాంప్ కలెక్టర్ ఉమ్మర్ ఫరూక్, తాను సేకరించిన వివిధ యూఏఈ స్టాంపులను ఈ ప్రదర్శనలో ఉంచారు. భారతదేశంలో ఇలాంటి స్టాంపులను ప్రదర్శించడం ఇదే మొదటిసారి అన్నారు. భారతదేశంలో ఫిలాటెలిస్టులు మాట్లాడుతూ, ప్రత్యేక పోస్టల్ కవర్ మరియు పోస్ట్ మార్క్ ఇవ్వడం భారతదేశంలో అరుదైన గౌరవం మరియు యూఏఈ మరియు భారతదేశం మధ్య ప్రస్తుత, అభివృద్ధి చెందుతున్న ద్వైపాక్షిక సంబంధాలను ప్రతిబింబిస్తుంది.
ఈ ప్రదర్శనను భారత ప్రభుత్వ పోస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో దుబాయ్‌లోని ‘ఎమిరేట్స్ ఫిలాటెలిక్ అసోసియేషన్’ మరియు భారతదేశం లోని ‘ఆల్ ఇండియా ఫిలాటెలిక్ ఫెడరేషన్’ & ‘ఫిలాటెలిక్ సొసైటీ ఆఫ్ ఇండియా’ సంయుక్తంగా నిర్వహించారు.
ఈ సంవత్సరం జాతీయ దినోత్సవ రిసెప్షన్లో ఎమిరాతీ డిజైనర్ ‘షంసా అల్ మెహైరి’ రూపొందించిన సాంప్రదాయ యూఏఈ దుస్తులను కలిగి ఉన్న ఫ్యాషన్ షో అందరిని ఆకర్షించింది. యూఏఈ తో బలమైన వాణిజ్య మరియు సాంస్కృతిక సంబంధాలు కలిగి ఉన్న స్థానిక సంస్థ ‘సి.డి. ఫౌండేషన్’ ఈ ఫ్యాషన్ షోను నిర్వహించింది.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..