పాప కోసం మరో పథకం.. కేంద్ర ప్రభుత్వ స్కీమ్..

- December 04, 2019 , by Maagulf
పాప కోసం మరో పథకం.. కేంద్ర ప్రభుత్వ స్కీమ్..

చిన్నారుల కోసం కేంద్ర ప్రభుత్వం మరో స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. నిజానికి ఈ పథకం పాతదే అయినా మరింత మందికి చేరవేసే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. బాలిక సమృద్ధి యోజన స్కీమ్ ఇది. 1997 నుంచే అమలులో ఉంది ఈ స్కీమ్. ఆడపిల్లలను బడి బాట పట్టించేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నమే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశ్యం. బాలిక సమృద్ధి యోజన కింద ఆడ పిల్ల పుట్టిన తరువాత అమ్మకు రూ.500 క్యాష్ గిప్ట్‌గా ఇస్తారు. తర్వాత ఆ పాప స్కూల్‌కు వెళ్లిన దగ్గరి నుంచి ప్రతి సంవత్సరం స్కాలర్‌షిప్ అందిస్తారు. అమ్మాయికి 18 ఏళ్లు వచ్చిన తరువాత డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు.

చిన్నారికి ఒకటవ తరగతి నుంచి మూడవ తరగతి వరకు సంవత్సరానికి రూ.300 అందజేస్తారు. 4వ తరగతిలో రూ.500, 5వ తరగతిలో రూ.600, 7వ తరగతిలో రూ.700, 8వ తరగతిలో రూ.800, 9వ తరగతిలో రూ.1000 స్కాలర్ షిప్ అందజేస్తారు. ఈ పథకంలో చేరాలంటే గ్రామాలలో అంగన్‌వాడీ వర్కర్ల దగ్గరకు వెళ్లి ఈ స్కీమ్ అప్లికేషన్ ఫిల్ చేసి పథకంలో చేరవచ్చు. పట్టణాల్లో అయితే హెల్త్ ఫంక్షనరీస్‌ వద్ద స్కీమ్ అప్లికేషన్స్ అందుబాటులో ఉంటాయి. స్కీమ్ అప్లికేషన్ ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com