తెలంగాణకు కేంద్రం కరువుసాయం

- January 14, 2016 , by Maagulf
తెలంగాణకు కేంద్రం  కరువుసాయం

రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. తెలంగాణ రాష్ర్టానికి రూ.791 కోట్ల కరువుసాయం అందజేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఇవాళ కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ ప్రకటన చేశారు. తెలంగాణకు కరువు సాయంపై ఏర్పాటైన అత్యున్నతస్థాయి కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకుందని తెలిపారు. అవిభాజ్య ఏపీకి కూడా ఇంత సాయం లభించలేదని మంత్రి వ్యాఖ్యానించారు. కాగా, తెలంగాణకు కరవు సాయం అందజేయాలని కోరుతూ సీఎం కేసీఆర్ గతంలో కేంద్ర మంత్రి రాధామోహన్‌సింగ్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. కాగా, నిన్న మంత్రి హరీష్‌రావు కేంద్ర మంత్రిని వ్యక్తిగతంగా కలిసి కరవుసాయం అందజేయాలని విజ్ఞప్తి చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com