దుబాయ్:ఆన్లైన్ ఫ్రీ గేమ్స్‌తో తస్మాత్ జాగ్రత్త!
- December 08, 2019
దుబాయ్:మీరు ఆన్లైన్లో ఫ్రీ వీడియో గేమ్స్ ఆడుతున్నారా? అయితే..తస్మాత్ జాగ్రత్త అని దుబాయ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఫ్రీ వీడియో గేమ్స్‌తో వ్యక్తిగత సమాచారానికి ముప్పు పొంచి ఉందని అంటున్నారు. ఫ్రీ గేమ్స్ ఆందించే యాప్స్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ఇతరులకు అందజేయటం ద్వారా ప్రాఫిట్ పొందుతాయని పోలీసులు తమ ట్వీట్ లో తెలియజేశారు.
పబ్జి, మొబైల్ లెజెండ్స్, కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ తరహా పాపులర్ అయిన వీడియో గేమ్స్ యాప్‌తో ప్రమాదం పొంచి ఉందని పోలీసులు వెల్లడించారు. ఈ తరహా వీడియో గేమ్ యాప్‌లను ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ, ఆ తర్వాత వ్యక్తిగత వివరాలకు మాత్రం గ్యారంటీ ఉండదు. కుటుంబసభ్యులు, స్నేహితులకు ఫ్రీ ఆన్లైన్ గేమ్స్ పట్ల అవగాహన కల్పించి వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







