ఒమన్‌ దమనియాత్‌ ఐలాండ్స్‌లో విజిటర్స్‌కి కొత్త ఎంట్రీ ఫీజ్‌

- December 09, 2019 , by Maagulf
ఒమన్‌ దమనియాత్‌ ఐలాండ్స్‌లో విజిటర్స్‌కి కొత్త ఎంట్రీ ఫీజ్‌

మస్కట్‌: దమానియాత్‌ ఐలాండ్స్‌కి వెళ్ళాలనుకునేవారు ఎంట్రన్స్‌ ఫీజు చెల్లించాల్సి వుంటుందని మినిస్ట్రీ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ క్లైమేట్‌ ఎఫైర్స్‌ వెల్లడించింది. నవంబర్‌ 26వ తేదీన ఈ మేరకు మినిస్టర్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ క్లైమేట్‌ ఎఫైర్స్‌ మొహమ్మద్‌ బిన్‌ సలీమ్‌ బిన్‌ సైద్‌ అల్‌ తూబి ఓ డెసిషన్‌ని విడుదల చేశారు. ఒమనీ అడల్ట్‌ 1 ఒమన్‌ రియాల్‌ చెల్లించాల్సి వుంటుంది. 16 ఏళ్ళ లోపువారికి 100 బైసా చెల్లిస్తే సరిపోతుంది. వలసదారులకు 3 ఒమన్‌ రియాల్స్‌ చెల్లించాల్సి వుంటుంది. 3 నెలలకు 30 ఒమన్‌ రియాల్స్‌, ఆరు నెలలకు 50 ఒమన్‌ రియాల్స్‌, ఏడాదికి 100 ఒమన్‌ రియాల్స్‌ వలసదారులు చెల్లించాలి. విజిటింగ్‌ మరియు డైవింగ్‌కి ఒమనీస్‌ 3 ఒమన్‌ రియాల్స్‌ చెల్లించాల్సి వుండగా, వలసదారులకు ఈ ఫీజు 6 ఒమన్‌ రియాల్స్‌గా నిర్ణయించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com