పార్లమెంట్ లో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం
- December 10, 2019
ఢిల్లీ:సుమారు 12 గంటల పాటు పౌరసత్వ సవరణ బిల్లు పై జరిగిన చర్చలు ముగిసాయి. మొత్తం 391 ఓట్లు పోలవగా..బిల్లుకు మద్దతుగా 311 ఓట్లు, వ్యతిరేకంగా 80 ఓట్లు వచ్చాయి. దీంతో లోక్ సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇది భారతదేశనికి చెందిన మైనారిటీలకు వ్యతిరేకంగా 0.001% కూడా లేదని స్పష్టంచేశారు. తద్వారా రాజ్యాంగ సమానత్వ సూత్రాలను ఉల్లంఘిస్తోందన్న ప్రతిపక్షాల వాదనను తోసిపుచ్చారు. 1947 విభజన సమయంలో మతం ప్రాతిపదికన భారతదేశాన్ని విభజించిన పార్టీ కాంగ్రెస్ అయినప్పుడు ఈ బిల్లును వివక్షపూరితంగా చెప్పే హక్కు ఆ పార్టీకి లేదని తెలిపారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి 'మైనారిటీ వలసదారులకు' పౌరసత్వ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రతిపాదించినందున ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడాయి, ముస్లిం సమాజానికి చెందిన వారిని దాని పరిధి నుండి తప్పించింది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







