యాప్ అప్ డేట్ చేసుకోండి...వీడియో కాల్ చేసుకోండి

- December 10, 2019 , by Maagulf
యాప్ అప్ డేట్ చేసుకోండి...వీడియో కాల్ చేసుకోండి

బాటిమ్ యాప్ ఇక నుంచి తమ వినియోగదారుల కోసం వీడియో కాల్స్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది.  టు టాక్ బ్రాండ్ ద్వారా వీడియో కాల్ సర్వీసులను అందించనున్నట్లు బాటిమ్ నిర్వాహకులు ప్రకటించారు. టు టాక్ లో వీడియో కాల్స్ పూర్తిగా ఉచితంగా అందిస్తున్నామని తెలిపింది. అలాగే వినియోగదారుల కాల్స్, మేసేజ్ ప్రైవసికి పూర్తి భద్రత ఉంటుందని వివరించింది. ఈ యాప్ ద్వారా ఇక నుంచి ఏ ప్రాంతానికైనా, ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా అన్ లిమిటెడ్ గా వీడియో, వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఉపాధి కోసం యూఏఈ  వలస వచ్చిన ప్రవాసీయులకు ఈ సౌకర్యం ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.  బంధువులు, స్నేహితులకు దూరంగా ఉంటున్నామనే బెంగ లేకుండా ఇక నేరుగా మాట్లాడిన అనుభూతి పొందవచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com