హెల్త్ టిప్స్ పోస్ట్ చేస్తున్నారా?..జర భద్రం!

- December 10, 2019 , by Maagulf
హెల్త్ టిప్స్ పోస్ట్ చేస్తున్నారా?..జర భద్రం!

యూ.ఏ.ఈ:సోషల్ మీడియాలో హెల్త్ టిప్స్ పోస్ట్ చేస్తున్నారా?..అయితే బీ కేర్ ఫుల్. ఇక నుంచి అలాంటి సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే చిక్కుల్లో పడతారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొస్తున్న హెల్త్ టిప్స్ ను కంట్రోల్ చేసే పనిలో ఉంది యూఏఈ ఆరోగ్య శాఖ. ఇకపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు కాకుండా ఎవరైనా అనధికారికంగా ఆరోగ్య సూత్రాలు అంటూ పోస్టులు పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లు ఆరోగ్య శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి. 

ఖచ్చితత్వం లేని ఆరోగ్య సూత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్  చేయటం వల్ల అది దుష్ప్రభావం చూపిస్తుందని పబ్లిక్ హెల్త్ పాలసీ & లైసెన్సింగ్ అసిస్టెంట్ సెక్రటరీ డాక్టర్ అమిన్ హుస్సేన్ అల్ అమిరి అభిప్రాయపడ్డారు. మిడిల్ ఈస్ట్ హెల్త్ కేర్ సోషల్ మీడియా తొలి సదస్సులో పాల్గొన్న ఆయన.. సామాజిక మాధ్యమాల్లో విస్త్రుతంగా ప్రచారం జరుగుతున్న అనధికారిక ఆరోగ్య సూత్రాలతో ప్రజలకు ముప్పు పొంచి ఉందని..అందుకే ఆరోగ్య సంబంధిత పోస్టుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక నుంచి ఎవరైనా తమ ఇష్టానుసారంగా హెల్త్ టిప్స్ ని పోస్ట్ చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com