అడ్డంగా దొరికిపోయిన టివి నటుడు

- December 10, 2019 , by Maagulf
అడ్డంగా దొరికిపోయిన టివి నటుడు

హైదరాబాద్:ఈ మద్య డబ్బు సంపాదించడమే పరమవధిగా భావిస్తున్న కొంత మంది కేటుగాళ్లు ఎంతకైనా తెగబడుతున్నారు. కష్టపడితే కొంత డబ్బే వస్తుంది..అదే అక్రమంగా సంపాదిస్తే కావలసినంత డబ్బు అన్నట్టుగా ఉన్నారు. అందుకోసం హైటెక్ వ్యభిచారం, దొంగతనాలు, డ్రగ్స్ దందా ఇలా ఎన్నో నేరాలకు పాల్పపడుతున్నారు. తాజాగా టీవీ సీరియళ్లలో నటించే ఓ యువకుడు దొంగతనాల బాట పట్టాడు. ఈ సంఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. దొంగ సొత్తుతో జల్సా జీవితానికి అలవాటు పడ్డాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. హైదరాబాద్ కూకట్‌పల్లిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. నాగారం వికాశ్‌నగర్‌కు చెందిన బలిజ విక్కీ (28) టీవీ సీరియల్ నటుడు. నటన ద్వారా వస్తున్న డబ్బులు జల్సాలకు సరిపోకపోవడంతో 2018లో చోరీల బాట పట్టాడు.
నగరంలోని పలు పోలీస్‌స్టేషన్ల పరిధుల్లో 10కి పైగా దొంగతనాలు చేశాడు. పోలీసులకు పట్టుబడి జైలుకు కూడా వెళ్లాడు. పీడీ యాక్ట్‌ నమోదు చేసినా తన పద్ధతి మార్చుకోలేదు. తిరిగి చోరీలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. నటనలో అవకాశం కల్పించేందుకు డబ్బు అవసరం కావడంతో 2018 నుంచి చోరీలు చేయడం ప్రారంభించాడు. సీరియల్స్‌లో నటిస్తూ చోరీలు చేసిన డబ్బుతో జల్సాలు చేస్తున్నాడు. అతడిపై కుషాయిగూడ, ఉస్మానియా యూనివర్సిటీ, నల్లకుంట పోలీస్‌స్టేషన్లలో తొమ్మిది కేసులు నమోదయ్యాయి.

గత నెల 15న కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధి, భాగ్యనగర్ స్నేహ సదన్ అపార్టుమెంట్‌లో చోరీకి పాల్పడ్డాడు. సుమారు రూ. 12 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దోచాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. సోమవారం నిందితుడిని అతని ఇంట్లో అరెస్ట్ చేశారు. నిన్న ఉదయం అతడిని ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ. 12 లక్షల విలువైన 330 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. విక్కీపై మరోమారు పీడీ యాక్ట్ ప్రయోగించనున్నట్టు పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com