ఉభయ సభల్లోనూ బిల్లు ఆమోదం పొందితే అమిత్‌షాపై ఆంక్షలు: యుఎస్‌ కమిషన్‌

- December 10, 2019 , by Maagulf
ఉభయ సభల్లోనూ బిల్లు ఆమోదం పొందితే అమిత్‌షాపై ఆంక్షలు: యుఎస్‌ కమిషన్‌

Washington: భారత ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన సిటిజన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ బిల్‌ (సిఎబి)పై అమెరికాలోని అంతర్జాతీయ మత స్వేచ్ఛపై ఏర్పాటైన కమిషన్‌ (యుఎస్‌ కమిషన్‌) అభ్యంతరం వ్యక్తం చేసింది.

"తప్పుడు మార్గంలో తీసుకున్న ప్రమాదకర మలుపు"గా ఈ బిల్లును యుఎస్‌
కమిషన్‌ అభివర్ణించింది. పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఈ బిల్లు ఆమోదం పొందితే రక్షణ మంత్రి అమిత్‌షాపై ఆంక్షలు విధించాలని కమిషన్‌ అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

ఈ బిల్లు ప్రకారం 2014 డిజెంబర్‌ 31వ తేదీలోగా పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ దేశాలనుంచి భారత్‌కు వలస వచ్చిన హిందువుల, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రిస్టియన్లపై వేధింపులు ఉండవు. వారికి భారత పౌరసత్వం కల్పిస్తారు.

లోక్‌సభలో ఈ బిల్లుకు ఆమోదం లభించడంపై తాము తీవ్రంగా ఆందోళనకు గురయ్యామని యుఎస్‌ కమిషన్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ రెలిజియస్‌ ఫ్రీడమ్‌ (యుఎస్‌సిఐఆర్‌ఎఫ్‌) పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com