దొంగతనం బారిన పడకుండా హెచ్చరిస్తూ వీడియో విడుదల చేసిన షార్జా పోలీసులు
- December 10, 2019
షార్జా: వ్యక్తిగత వస్తువులను కారులో వదిలేయడం; ముఖ్యంగా విలువైనవి అనగా హ్యాండ్‌బ్యాగులు, నగదు, మొబైల్ ఫోన్లు లేదా ల్యాప్‌టాప్ లు - మిమ్మల్ని దొంగతనానికి గురి చేస్తాయని పోలీసులు హెచ్చరించారు.
తన సోషల్ మీడియా ఖాతాలలో, షార్జా పోలీసులు అర్ధరాత్రి ఒక సాధారణ దోపిడీ ఎలా జరుగుతుందో పునః సృష్టిస్తూ వీడియోను ప్రచురించారు. “మీ విలువైన వస్తువులు మీ బాధ్యత” అంటూ హెచ్చరిస్తున్నారు. "ఈ ప్రచారం యొక్క లక్ష్యం సమాజ సభ్యులలో వారి ఆస్తులను కాపాడటానికి అప్రమత్తతను పెంచడం" అని పోలీసులు తెలిపారు.
ముఖ్యంగా రాత్రి సమయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏమర్జెన్సీ సమయాల్లో 999, నాన్ ఏమర్జెన్సీ సమయాల్లో 901 కు కాల్ చేయాలని సూచించారు. అలాగే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్ -80040, సెంట్రల్ రీజియన్ ఆపరేషన్స్ -8027777-60 కి ఫోన్ చేయాలని పోలీసులు కోరారు.
ఈ విలువైన వస్తువులను ఎప్పుడూ కారులో వదలకండి:
• ఫోన్
• హ్యాండ్‌బ్యాగ్ లేదా వాలెట్
• ల్యాప్‌టాప్ (లేదా దాని బ్యాగ్)
• బ్రీఫ్‌కేస్ లేదా బ్యాక్‌ప్యాక్
• షాపింగ్ బ్యాగులు
• క్యాష్
కారు దొంగతనాలను ఎలా నిరోధించాలి:
• మీ వాహనాన్ని ఎల్లప్పుడూ లాక్ చేయండి
• మీ కారును ON చేసి ఉంచి మీరు పక్కకు వెళ్ళద్దు
• ఆపి ఉంచినప్పుడు, అన్ని కిటికీలను మూసివేయండి
• బాగా వెలుగు ఉన్న ప్రదేశాలలో పార్క్ చేయండి
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







