వాహనదారులకు అజ్మన్ పోలీసుల ఆఫర్
- December 12, 2019
అజ్మన్:మీ వాహనాలపై ఎక్కువ మొత్తం ట్రాఫిక్ చలాన్లు ఉన్నాయా? ఫైన్ బకాయిలను ఒకేసారి పెద్ద మొత్తంలో చెల్లించలేకపోతున్నారా? ఇక నుంచి ట్రాఫిక్ చలాన్ల డ్యూస్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సులభంగా వాయిదా పద్దతుల్లో కూడా ఫైన్ బకాయిలు చెల్లించే అవకాశం కల్పించారు అజ్మన్ పోలీసులు. ఈ మేరకు ఎమిరేట్స్ ఇస్లామిక్ బ్యాంక్ తో అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు అజ్మన్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ మేజర్ జనరల్ షేక్ సుల్తాన్ బిన్ అబ్దుల్లా అల్ నౌమి తెలిపారు.
అయితే..వాయిదా పద్దతుల్లో ఫైన్ బకాయిలు చెల్లించేందుకు కొన్ని కండీషన్లు కూడా ఉన్నాయి. 1000 దిర్హమ్ లకుపైగా ఫైన్ డ్యూస్ ఉన్నవారు మాత్రమే వాయిదాల్లో జరిమాన చెల్లించేందుకు అర్హులు. అలాగే ఎమిరేట్స్ ఇస్లామిక్ బ్యాంక్ వినియోగదారులు అయి ఉండాలి. మొత్తం బకాయిని 12 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ట్రాఫిక్ జరిమానాలు ప్రజలకు ఆర్ధిక భారంగా మారకుండా సులభంగా వాయిదా పద్దతుల్లో ఫైన్లు చెల్లించే వెసులుబాటు కల్పించటమే తమ ఉద్దేశమని మేజర్ జనరల్ షేక్ సుల్తాన్ బిన్ అబ్దుల్లా అల్ నౌమి వెల్లడించారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







