నేటితో ముగియనున్న ఐసిబి టాలెంట్ ఫెస్ట్ 2019
- December 12, 2019
బహ్రెయిన్: ఇండియన్ క్లబ్ బహ్రెయిన్ నిర్వహిస్తోన్న చిల్డ్రన్స్ కల్చరల్ ఫెస్టివల్ - ఐసిబి టాలెంట్ ఫెస్ట్ 2019 నేటితో ముగియనున్నట్లు ప్రకటించింది. 1288 మంది చిన్నారులు, ఆరు కేటగిరీల్లో ఈ ఫెస్టివల్లో పాల్గొన్నారు. ఈ ఫెస్టివల్, ఈ రోజు జరిగే గ్రాండ్ ఫినాలెతో ముగుస్తుంది. ఇండియన్ క్లబ్ ప్రాంగణంలో ఈ వేడుకలు జరుగుతాయి. లిటరేచర్, మ్యూజిక్, డాన్స్, ఆర్ట్ సహా పలు ఇతర ఈవెంట్స్‌లో పోటీలు జరిగాయి. 5 నుంచి 18 ఏళ్ళ మధ్య వయసున్న చిన్నారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. నమితా ప్రమోద్ ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. కాగా, గెస్ట్ ఆఫ్ హానర్‌గా ఇండియన్ మూవీ మేకర్ బోబన్ సామ్యుయేల్ వ్యవహరిస్తారు. ఐసిబి ఆర్టిస్టిక్ పెరల్గా శిల్పా సంతోష్ ప్రకటితమయ్యారు. లిటరరీ డైమండ్ 2019 పురస్కారానికి శ్రీహంసిని బాలమురుగన్ ఎంపిక కావడం గమనార్హం. ఆర్టిస్టిక్ స్పెషల్ అవార్డ్ మియా మరియమ్ అలెక్స్ గెల్చుకున్నారు. రిత్విక శ్రీనాథ్, గ్రూప్ త్రీ స్పెషల్ అవార్డ్ దక్కించుకున్నారు. ఐసిబి టాలెంట్ ఫెస్ట్ స్పెసల్ అవార్డ్‌ని అద్వయిత్ కుమార్ అందుకోనున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







