జజాన్‌లో సినిమా థియేటర్‌ ప్రారంభం

- December 12, 2019 , by Maagulf
జజాన్‌లో సినిమా థియేటర్‌ ప్రారంభం

సౌదీ: జజాన్‌ డిప్యూటీ గవర్నర్‌ ప్రిన్స్‌ మొహమ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌, సౌదీ అరేబియా సదరన్‌ రీజియన్‌లో తొలి సినిమా థియేటర్‌ని ప్రారంభించారు. 42 మిలియన్‌ సౌదీ రియాల్స్‌ ఖర్చుతో దీన్ని రూపొందించడం జరిగింది. జజాన్‌ సిటీలోని అల్‌ రషీద్‌ మాల్‌లో ఈ థియేటర్‌ని ఏర్పాటు చేశారు. జనవరిలో జెడ్డా తొలి సినిమా, సందర్శకులకు రెడ్‌ కార్పెట్‌ పరిచింది. ప్రతి యేడాదీ 35 మిలియన్ల మంది కింగ్‌డమ్‌లో సినిమా చూస్తారనేది ఓ అంచనా. దశాబ్దాలుగా సౌదీ అరేబియాలో సినిమాలపై బ్యాన్‌ వుంది. దాన్ని ఎత్తివేయగా, గత ఏప్రిల్‌లో రియాద్‌లో తొలిసారిగా సినిమా ప్రారంభమయ్యింది. 2030 నాటికి ప్రతి 100,000 మందికి 6.6 థియేటర్లు వుండేలా అంచనాలతో సినిమాల నిర్మాణం జోరందుకుంటోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com