తిరుమలలో వ్యక్తి ఆత్మహత్య..

- December 13, 2019 , by Maagulf
తిరుమలలో వ్యక్తి ఆత్మహత్య..

తిరుమల : తిరుమలలో విషాదం చోటు చేసుకుంది. కదులుతున్న టీటీడీ పాల లారీ కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీవారి ఆలయానికి సమీపంలోని మాడ వీధిలో పాలు దించిన పాల మిత్ర లారీ ముందుకు కదులుతుండగా పక్కనే ఉన్న వ్యక్తి వెనుక చక్రాల కింద కు వెళ్లడం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. అతడు అక్కడికక్కడే మరణించాడు..మొదట దీన్ని ప్రమాదంగా భావించారు. అయితే సీసీ ఫుటేజ్ చూశాక ఆత్మహత్యగా పోలీసులు కేసు నమోదు చేశారు. మరణించిన వ్యక్తి వివరాలు సేకరించే పనిలో పోలీసులు పడ్డారు.. కాగా, తిరుమల మాడవీధిలో ఈ ఆత్మహత్య జరగడంతో వెంటనే ఆలయంలో శ్రీవారి దర్శనాలు నిలిపి వేశారు. మాడ వీదులలో మృతి చెందడంతో ఆలయ ఆగమ సలహాదారు రమణ దీక్షితులు సూచనతో ఆలయంలో శుద్ది కార్యక్రమం నిర్వహించి అనంతరం శ్రీవారి దర్శన భాగ్యం కలిగించారు.. ఈ ఘటనపై రమణ దీక్షీతులు మీడియాతో మాట్లాడుతూ, శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో పాల వ్యాన్ క్రింద పడి ఓ వ్యక్తి చనిపోవడం దారుణమన్నారు. . తిరుమల లో దేహ త్యాగం చెస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందన్న మూడనమ్మకంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదన్నారు. తిరుమల లో ప్రమాదవశాత్తు ఎదైనా మరణం సంభవిస్తే అలాంటి వారు మాత్రమే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బ తీసేవిదంగా ఉన్న ఇటువంటి వాటిని ఎవరూ చేయకూడదన్నారు. మాడ వీధిలో ఈ ఆత్మహత్య జరగడంతో ఆగమ శాస్ర్తానుసారం సంప్రోక్షణ నిర్వహించామని, దీంతో కొంత సేపు భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేశామని వెల్లడించారు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com