వెంకీ మామ రివ్యూ
- December 13, 2019
చిత్రం: వెంకీ మామ
నటీనటులు: వెంకటేష్, నాగ చైతన్య, పాయల్ రాజ్‌పుత్, రాశి ఖన్నా, ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్, రావు రమేస్, బ్రహ్మాజీ తదితరులు
దర్శకత్వం: కేఎస్ రవీంద్ర (బాబి)
నిర్మాతలు: దగ్గుబాటి సురేష్ బాబు, టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల
సంగీతం: థమన్
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల
ఎడిటర్: ప్రవీణ్ పూడి
రియల్ లైఫ్ మేనమామ, మేనల్లుడు వెంకటేష్, నాగచైతన్య కలిసి నటించిన చిత్రం 'వెంకీ మామ'. నాగ చైతన్య నటించిన 'ప్రేమమ్' చిత్రంలో వెంకటేష్ ఓ చిన్న పాత్రలో సందడి చేయగా.. ఈ సినిమాలో ఈ ఇద్దరు పూర్తి స్థాయిలో నటించారు. దీంతో ఈ సినిమా ప్రారంభించినప్పటి నుంచి అభిమానుల్లో అంచనాలు మొదలయ్యాయి. దానికి తోడు టీజర్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకోవడంతో వెంకీ మామ కోసం ఫ్యాన్స్ ఎదురుచూశారు. అయితే ఆ మధ్యలో ఈ సినిమా విడుదల విషయంలో కొన్ని డైలామాలు జరగ్గా.. చివరకు వెంకటేష్ పుట్టినరోజును రిలీజ్ డేట్‌గా ఫిక్స్ చేశారు. ఇక ఇన్ని అంచనాల మధ్యన ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకీ మామ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.
కథ:
చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న కార్తీక్(నాగ చైతన్య) తన మేనమామ వెంకటరత్నం నాయుడు(వెంకటేష్) దగ్గర పెరుగుతుంటాడు. మేనల్లుడంటే అమితమైన ఇష్టమైన వెంకటరత్నం చిన్నప్పటి నుంచి కార్తీక్‌ను గారాబంగా పెంచుతుంటాడు. అయితే కార్తీక్‌ను ఇంట్లో పెట్టుకోవడం వెంకటరత్నం నాయుడు తండ్రి(రామ్ నారాయణ)కు అస్సలు ఇష్టం ఉండదు. కార్తీక్ జాతకంలో దోషం ఉండటం వలనే తన ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుంటాయని రామ్ నారాయణ భావిస్తూ ఉంటాడు. దీంతో కార్తీక్‌ను అస్సలు పట్టించుకోడు. ఇక వయసులో తేడా ఉన్నప్పటికీ.. వీరిద్దరు కలిసి జాలీగా తిరుగుతుంటాడు. అయితే కొన్ని కారణాల వలన వెంకటరత్నంకు చెప్పకుండా కార్తీక్ ఇంటి నుంచి వెళ్లిపోయి ఆర్మీలో చేరుతాడు. ఈ విషయం తెలిసిన వెంకటరత్నం మేనల్లుడిని వెతుక్కుంటూ సరిహద్దుకు వెళతాడు. అసలు కార్తీక్ ఎందుకు ఆర్మీకి వెళ్లాల్సి వచ్చింది..? మేనల్లుడిని వెంకటరత్నం ఎలా ఇంటికి తెచ్చుకున్నాడన్నది మిగిలిన కథ.
ఎలా ఉందంటే:
తన స్క్రిప్ట్‌తో రియల్ లైఫ్ మేనమామ- మేనల్లుడిని ఒప్పించిన దర్శకుడు బాబీ సినిమా తీయడంలో అక్కడక్కడ తడబడినప్పటికీ.. ఓవరాల్‌గా వెంకీ మామను బాగానే తెరకెక్కించాడు. అయితే వెంకటేష్ పాత్రతో పోలిస్తే చైతూ కారెక్టర్ చాలా తక్కువ చేశాడు. ప్రీ రిలీజ్ వేడుకలో తన పాత్ర కంటే చైతూ పాత్రనే ఎక్కువ పెట్టమని దర్శకుడికి తాను చెప్పాను అని వెంకటేష్ అన్నప్పటికీ.. సినిమాలో మాత్రం వెంకీ పాత్ర మీదే ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు డిఫరెంట్ మేనరిజం కలిగిన వెంకటేష్.. తన నటనతో చైతూను మరింత డామినేట్ చేశాడు. ఫస్టాఫ్ మొత్తంలో పలుచోట్ల కామెడీ సీన్లు ఉండగా.. సెకండాఫ్‌లో డైరక్టర్ యాక్షన్ మీద ఫోకస్ చేశాడు. ఆర్మీ సన్నివేశాలకు బాగానే ఖర్చు చేసినప్పటికీ.. దర్శకుడు మాత్రం ఆ రేంజ్‌లో తెరకెక్కించలేకపోయాడు.
నటీనటులు:
ఈ సినిమాను ప్రధానాకర్షణ వెంకటేష్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం ఉండదు. ఇంకా చెప్పాలంటే సినిమా మొత్తాన్ని తన భుజాలపై నడిపించాడు. నాగ చైతన్య బాగానే నటించినప్పటికీ.. అతడి పాత్రను ఇంకా ఎలివేట్ చేసుంటే బావుండేది. ఎమ్మెల్యే కుమార్తెగా రాశి ఖన్నా తన పాత్ర మేరకు నటించగా.. టీచర్‌గా పాయల్ రాజ్‌పుత్ మెప్పించింది. రావు రమేష్, ప్రకాష్ రాజ్, నాజర్ పాత్రలకు పెద్దగా స్కోప్ లేక పోగా.. వారి పాత్రల మేరకు మెప్పించారు.
సాంకేతిక విభాగం:
థమన్ అందించిన పాటలు యావరేజ్ టాక్ తెచ్చుకోగా… ఎన్నేళ్లకో, కోకా కోలా పెప్సీ పాటలు చూడటానికి బావున్నాయి. బ్యాగ్రౌండ్ పర్వాలేదనిపించింది. ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ కూడా బావుంది. ఎడిటింగ్ ఇంకాస్త చేసింటే బావుండు.
పాజిటివ్స్:
వెంకీ మామ కారెక్టర్
రెండు మాస్ సాంగ్స్
కామెడీ సీన్లు
నెగిటివ్స్:
కశ్మీర్ ఎపిసోడ్స్
స్క్రిప్ట్
ఫైనల్‌గా:
అభిమానులు మాత్రమే మెచ్చే వెంకీ మామ
--మాగల్ఫ్ రేటింగ్:2.5/5
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







