విద్యార్థినులపై లైంగిక వేధింపులు: వలసదారుడికి జైలు శిక్ష
- December 13, 2019
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ ఓ వలస కార్మికుడ్ని విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడన్న అభియోగాల నేపథ్యంలో అరెస్ట్ చేశారు. కేసు వివరాల్లోకి వెళితే, నిందితుడు ఓ స్కూల్‌లో పనిచేస్తున్నాడు. బాలికలకు తన వద్దనున్న మొబైల్ ఫోన్‌లో పోర్న్ వీడియోలు చూపించడం, వారితో అసభ్యంగా ప్రవర్తించడం, లైంగిక వేధింపులకు గురిచేస్తుండడంతో విద్యార్థినులు, తమ తల్లిదండ్రులకు విషయాన్ని చేరవేశారు. తల్లిదండ్రులు, నిందితుడిపై తొలుత స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు, ఆ తర్వాత పోలీసులకు సమాచారమిచ్చారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు, నిందితుడి నుంచి నిజాల్ని రాబట్టారు. విచారణలో నిందితుడు తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. కాగా, న్యాయస్థానం నిందితుడికి ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది. అలాగే 5,000 ఒమన్ రియాల్స్ జరీమానాతోపాటు, శిక్ష ముగిశాక నిందితుడ్ని డిపోర్ట్ చేయాలని న్యాయస్థానం ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా







