దిశ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం..!

- December 13, 2019 , by Maagulf
దిశ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం..!
అమరావతి:ఐదో రోజు జరుగుతున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో.. దిశ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదాన్ని ఇచ్చింది. 13 జిల్లాలో 13 స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, స్పెషల్ పోలీస్ స్టేషన్లను మహిళల కై ఏర్పాటు చేస్తామని జగన్ చెప్పారు. మహిళలపై నేరం చేసినట్లు రుజువైతే, సరైన ఆధారాలు ఉంటే.. 21 రోజుల్లో మరణ శిక్ష పడేలా చట్టంలో మార్పులు.

ఎవరైనా మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చేస్తే రెండేళ్ళ శిక్ష విధిస్తారని తెలిపారు. మళ్లీ రెండోసారి చేస్తే.. నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించేలా మార్పులు. ఇలాంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటేనే.. సమాజంలో ఇటువంటి అకృత్యాలు తగ్గుతాయని జగన్మోహన్ రెడ్డి అన్నారు.మహిళలు చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని, నేరం చేసిన ఎంతటివారినైనా వదలకూడదని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
 
మహిళలు, పిల్లలపై జరిగే లైంగిక వేధింపుల అరికట్టడం కోసం స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేస్తామని జగన్మోహన్ రెడ్డి నిండు సభలో వెల్లడించారు. దేశంలోని ప్రతిష్ఠాత్మక చారిత్రాత్మక బిల్లుగా ఆంధ్ర ప్రదేశ్ దిశ బిల్లు రికార్డుకెక్కింది. నిర్భయ దోషులకు ఇంతవరకు శిక్ష పడలేదని జగన్మోహన్ రెడ్డి చెప్పారు.

అదే విధంగా హైదరాబాద్ షాద్నగర్ దిశ ఘటన అందరిని కలచి వేసిందని... దాని తర్వాత నే ఈ బిల్లును తీసుకురావాలనే నిర్ణయించుకున్నామని జగన్ అన్నారు. ఎట్టకేలకు దేశ బిల్లు పై సుదీర్ఘమైన చర్చ జరిగిన తర్వాత అసెంబ్లీలో ఆమోదం లభించింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... దిశ యాక్ట్ ను తీసుకురావడాన్ని స్వాగతిస్తున్నాం అని చెప్పారు. దిశ కు జరిగిన సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని జగన్ చెప్పారు. దిశ తండ్రి కూడా జగన్మోహన్ రెడ్డికు దిశ యాక్ట్ ను తీసుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com