ఆకట్టుకుంటున్న 'హీరో' ట్రైలర్
- December 13, 2019
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్, కల్యాణి ప్రియదర్శన్ జంటగా.. కేజేఆర్ స్టూడియోస్ బ్యానర్‌పై, PS మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్.. 'హీరో'..
'యాక్షన్ కింగ్' అర్జున్, బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్, ఇవానా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. శుక్రవారం థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
సూపర్ హీరోగా శివ కార్తికేయన్ కనిపించగా అర్జున్, అభయ్ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. విద్య, వైద్యం వంటి అంశాలతో ఈ చిత్రం తెరకెక్కినట్టు తెలుస్తోంది. విశాల్ నటించిన 'ఇరుంబు తిరై' (తెలుగులో అభిమన్యుడు) సినిమాతో ప్రశంసలందుకున్న మిత్రన్ 'హీరో' చిత్రాన్ని కూడా మంచి మెసేజ్‌తో రూపొందించారని కోలీవుడ్ సమాచారం.
విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. డిసెంబర్ 20న 'హీరో' ప్రేక్షకుల ముందుకు రానుంది. సంగీతం : యువన్ శంకర్ రాజా, కెమెరా : జార్జ్ సి. విలియమ్స్, ఎడిటింగ్ : రూబెన్, స్టంట్స్ : దిలీప్ సుబ్బరాయన్, కొరియోగ్రఫీ : రాజు సుందరం, సతీష్.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







