అబుదాబి: లండన్ లో మృతి చెందిన ఒమని యువకుడి కుటుంబాన్ని పరామర్శించిన యువరాజు
- December 14, 2019
లండన్ లో దోపిడి దొంగల దాడితో మృతి చెందిన ఒమని కుటుంబాన్ని అబుదాబి యువరాజు షేమ్ మొహమ్మద్ బిన్ జయాద్ పరామర్శించారు. మస్కట్ లో నివాసముంటున్న వ్యాపారవేత, అల్ రైడ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యజమాని అబ్ధుల్లా అల్ అరైమి ఇంటికి వెళ్లి బాధిత కుటుంబానికి సంతాపం ప్రకటించారు. అబ్దుల్లా అల్ అరైమి కుమారుడు మొహమ్మద్ అల్ అరైమీ గత డిసెంబర్ 6న దోపిడి దొంగల దాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే. మధ్యరాత్రి వేళ లండన్ లోని నైట్స్ బ్రిడ్జి ప్రాంతంలో ఈ దాడి జరిగింది. మొహమ్మద్ అల్ అరైమి లండన్ కింగ్స్ కాలేజీలో పాలిటిక్స్ &
ఎకనామిక్స్ చదువుతున్నాడు. భోజనం చేసిన తర్వాత అర్ధరాత్రి సమయంలో స్నేహితుడితో కలిసి నడిచివెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దాడిలో మొహమ్మద్ అల్ అరైమీ మృతి చెందగా..అతని స్నేహితుడికి గాయాలయ్యాయి. అయితే..ఘటనపై విచారణ జరుగుతోందని, పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సి ఉందని, దాడికి పాల్పడింది ఎవరో తెల్సుకోవాల్సి ఉందని లండన్ పోలీసులు చెబుతున్నారు.
కుమారుడి మరణంతో విషాదంలో మునిగిపోయిన అబ్దుల్లా అల్ అరైమి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఉప ప్రధాని షేక్ మన్సూర్ బిన్ జాయెద్ కూడా వ్యాపారవేత కుటుంబానికి సంతాపం తెలిపారు. తమ కుటుంబాన్ని పరామర్శించిన యువరాజుకు ధన్యవాదాలు తెలిపారు. డిసెంబర్ 6న జరిగిన దుర్ఘటన తమ జీవితంలో తేరుకోలేని విషాదాన్ని నింపిదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుడి మృతి వార్తతో తమ గుండెలు బద్ధలైనంత పని జరిగిందన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







