దుబాయ్ : వేలానికి ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్లు..డిసెంబర్ 21 నుంచి షురూ
- December 14, 2019
దుబాయ్ లో వాహనాల ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్లు వేలం పాటకు రానున్నాయి. 2 నుంచి 5 డిజిట్స్ గల 90 నెంబర్ ప్లేట్లను డిసెంబర్ 21న ఇంటర్ కాంటినెంటల్ దుబాయ్ ఫెస్టివల్ లో రోడ్డు రవాణా అధికారులు వేలానికి తీసుకురానున్నారు. H నుంచి Z, మైనస్ J నుంచి Y అక్షరాలు కలిగిన నెంబర్ ప్లేట్లను ఈ ఏడాదికి చివరిదైన ఈ వేలం పాటలో వాహనదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. వేలం పాటలో పాల్గొనాలని అనుకునే బిడ్డర్లు వచ్చే ఆదివారం నుంచి ఆర్టీఏ వెబ్ సైట్ లేదా ఉమ్మ్ రమూల్ లోని కస్టమర్స్ హ్యాపీ నెస్ సెంటర్స్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వేలం పాట జరిగే ముందు నిమిషం వరకు పేర్లు రిజిస్టర్ చేసుకోవచ్చు.
ఈ వేలం పాటలో 'O 10'తో పాటు న్యూ జనరేషన్ డబుల్ కోడెడ్ నెంబర్ ప్లేట్లు(AA1111-AA111-AA99) వేలం వేయనున్నారు. ఈ డబుల్ కోడెడ్ నెంబర్ ప్లేట్లకు పోటీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ వెహికిల్స్ లైసెన్సింగ్ అధికారి జమల్ అల్ సదహ్ తెలిపారు. లైసెన్సింగ్ నెంబర్ ప్లేట్ల అమ్మకం ధరలో 5 శాతం వ్యాట్ చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి బిడ్డర్ దుబాయ్ లో ట్రాఫిక్ ఫైల్ ఓపెన్ చేసి సెక్యూరిటీ డిపాజిట్ కింద 25,000 దిర్హామ్ లు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే నాన్ రిఫండబుల్ పార్టిసిపేషన్ ఫీ కింద 120 దిర్హామ్ లు చెల్లించాలి.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







