షార్జాలో పూర్తైన రోడ్డు అభివృద్ధి పనులు
- December 14, 2019
షార్జాలోని అబు షాఘర రహదారులు కొత్త రూపు సంతరించుకున్నాయి. షార్జా రోడ్స్&ట్రాన్స్ పోర్ట్ అథారిటీ-SRTA చేపట్టిన అంతర్గత రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులు ఎట్టకేలకు పూర్తైయ్యాయి. SRTA ఛైర్మన్ యూసుఫ్ సలెహ్ అల్ సువైజి మాట్లాడుతూ' ఎమిరేట్ రహదారులను మరింత
మెరుగుపర్చాలనే వార్షిక ప్రణాళికలో భాగంగా అబు షాఘరలో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయి. రోడ్ల విస్తరణ, అభివృద్ధి, అన్ని ఎమిరేట్ రహదారులను అనుసంధానం చేసేలా రోడ్ల అధునీకరణే రోడ్ ఇంప్రూవ్ మెంట్ ప్రాజెక్ట్ లక్ష్యం. తద్వారా ఎమిరైట్స్ వాహదారులు సౌకర్యవంతంగా
సురక్షితంగా ప్రయాణించేందుకు ప్రధాన్యత ఇస్తున్నాం' అని అన్నారు.
రహదారుల నిర్వహణ డైరెక్టర్ మోహ్ సెన్ బల్వాన్ మాట్లాడుతూ అబు షాఘర అంతర్గత రహదారుల్లో సరికొత్త మార్పులు చేపట్టామని అన్నారు. సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా విస్తరించి ట్రాఫిక్ చిక్కులు లేకుండా వాహనాల రాకపోకలు కొనసాగించే మెరుగైన రహదారులు ఏర్పాటు చేశామని వివరించారు. రోడ్ల విస్తరణ కోసం యూజ్డ్ కార్ల షోరూమ్ స్థలాన్ని సేకరించినట్లు SRTA అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ తో రోడ్లపై రద్దీ తగ్గటమే కాకుండా, పీక్ అవర్స్ లో కూడా లింక్ రోడ్ల నుంచి ఎంట్రీ, ఎగ్జిట్ కు సులువుగా ఉంటుందని అన్నారు. రహదారుల చేపట్టిన విస్తరణ కారణంగా వాహనదారులు అయోమయానికి గురికాకుండా ఎక్కడిక్కడ మార్కింగ్ లైన్స్, సైన్ బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







