యూఏఈ: కఠిన నాణ్యతా ప్రమాణాలు పాటిస్తేనే మార్కెట్లోకి ఉత్పత్తులు
- December 14, 2019
దేశంలో అమ్మే ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలకు తాము భరోసా ఇస్తున్నామని యూఏఈ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రొడక్ట్స్ ఏవైనా నాణ్యత విషయంలో కఠిన ప్రమాణాలు పాటిస్తున్నామని వెల్లడించారు. యూఏఈలో తయారైన ఉత్పత్తులతో పాటు విదేశాల నుంచి దిగుమతి అయ్యే ప్రొడక్ట్స్ ఎమిరెట్స్ క్వాలిటీ మార్క్ కు అనుగుణంగా ఉన్నాయని ఎమిరేట్స్ అథారిటీ ఫర్ స్టాండర్డైజేషన్ అండ్ మెట్రాలజీ-Esma అధికారులు తెలిపినట్లు న్యూస్ ఏజెన్సీ వామ్ వివరించింది. ప్రమాణాలను పాటించని ఉత్పత్తులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. గత వారం క్యాన్సర్ కారకం ఆస్బెస్టాస్ ఫైబర్స్ ఉన్నట్లు గుర్తించిన 41 బ్రాండ్ల థర్మల్ ప్లాస్క్ లను వెంటనే మార్కెట్ నుంచి ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు. సురక్షితమైన ఫ్లాస్క్ ల కోసం ESMAతో స్థాపించబడిన ఎమిరేట్స్ కన్ఫార్మిటీ అసెస్మెంట్ సిస్టమ్ మార్క్ ఉన్న ఫ్లాస్క్లను మాత్రమే కొనుగోలు చేయాలని వినియోగదారులకు అధికారులు సూచించారు.
అయితే.. కొన్ని ఉత్పత్తులకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామని, ఫిర్యాదుదారులు రెగ్యూలేటరీ అధికారులను సంప్రదించాలని సూచించారు. అయితే..యూఏఈలో తయారయ్యే అంతర్జాతీయ బ్రాండ్ల ఉత్పత్తులు అత్యున్నత ప్రమాణాలతో వినియోగదారుల అంచనాల తగినట్లు ఉన్నాయని ESMA అధికారులు చెబుతున్నారు. ఆస్బెస్టాస్ ఉన్న థర్మల్ ప్లాస్క్ లను మార్కెట్లో నుంచి ఉపసంహరించుకునేందుకు Esma అధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వినియోగదారుల రక్షణ విభాగం ముఖ్య అధికారి మొహమ్మద్ లూతహ్ వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







