హాట్ చిప్స్ తింటే అంత ప్రమాదమా
- December 15, 2019
హాట్ చిప్స్ తింటూ.. కూల్ డ్రింక్ తాగితే భలే మజాగా ఉంటుంది కదూ. అంతవరకు ఒకే, రోజూ అదేపనిగా వాటిని తింటూ కూర్చుంటే.. మంచమెక్కడం ఖాయం అంటున్నారు వైద్య నిపుణులు. ఔను, నిజం! తమిళనాడులోని బొన్హేరు పిల్లల ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చే చాలామంది చిన్నారులు హాట్ చిప్స్ బాధితులేనట. ఇటీవల చిన్నారులకు జరిపిన ‘టేస్ట్’ పరీక్షల్లో.. కొన్ని చేదు నిజాలు బయటపడ్డాయి.
ఆ ఆసుపత్రికి రోజూ వచ్చే చిన్నారుల్లో కనీసం 100 మంది హాట్ చిప్స్ వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నవారేనని తెలిసింది. కడుపు నొప్పి, రక్తపు వాంతులు, మూత్రం, మలం నుంచి రక్తం రావడం వంటి సమస్యలతో వస్తున్నారు. అయితే, ఆ ఎర్ర రంగు రక్తం కాదని, ఆయా హాట్ చిప్స్‌లో వేసే ఎర్ర రంగని వైద్యులు పేర్కొన్నారు. ఆ బాధితుల్లోని చాలామంది తల్లిదండ్రులకు.. తమ పిల్లలు ఏం తింటున్నారు కూడా తెలీదన్నారు.
ఇది కేవలం పిల్లలకే పరిమితం కాలేదు. పెద్దలను కూడా ఈ సమస్య వెంటాడుతోంది. అయితే, పిల్లలు బాల్యం నుంచే ఇలాంటి ఆహారాన్ని తిన్నట్లయితే దీర్ఘకాలిక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు తెలుపుతున్నారు. ఆ ఆసుపత్రికి చెందిన పెడియాట్రిక్ గ్యాస్ట్రోయంటెరాలజిస్ట్ క్యారీ కవెండర్ మాట్లాడుతూ.. ‘‘ఇక్కడికి వచ్చే చిన్నారుల్లో ఎక్కువమంది పొత్తి కడుపులో నొప్పి, గుండెల్లో మంట సమస్యతో బాధ పడుటాన్ని గుర్తించాం. ఈ సమస్యతో వచ్చే చిన్నారులను మొట్ట మొదట అడిగే ప్రశ్న.. హాట్ చిప్స్ తింటున్నారా? అని. ఎందుకంటే పిల్లలపై హాట్ చిప్స్ ప్రభావం అంతగా ఉంది’’ అని తెలిపారు.
దీనిపై FDA రికార్డుల ప్రకారం.. ఈ హాట్ చిప్స్, స్నాక్స్ తిన్న తర్వాత వాంతులు, కొడుపు నొప్పి, వికారానికి గురవ్వుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. అయితే, ఈ ఫిర్యాదులు చాలా తక్కువగా ఉండటం వల్ల ప్రస్తుతం మార్కెట్లో హాట్ చిప్స్‌ను విక్రయిస్తున్న సంస్థలపై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇటీవల తల్లిదండ్రులు పిల్లలకు స్నాక్స్‌గా పెట్టేందుకు పెద్ద పెద్ద హాట్ చిప్స్ సంచులను కొని ఇళ్లల్లో పెట్టుకుంటున్నారు. వాటి వల్ల తమ పిల్లలకు సమస్య వచ్చినా.. FDAకు ఫిర్యాదు చేయాలనే ఆలోచన కూడా కలగడం లేదు.
ఎసిడిటీ ముప్పు?: హాట్ చిప్స్ తినేవారు త్వరగా ఎసిడిటీకి గురయ్యే ప్రమాదం ఉందని పరిశోధకులు తెలుపుతున్నారు. కడుపులో ఉండే పేగులు 5 pH (ఎసిడిటీకి కొలమానం) ఎసిడిటీని మాత్రమే భరిస్తాయి. అయితే, హాట్ చిప్స్, స్నాక్స్‌లలో 3 pH ఎసిడిటీ ఉంటున్నట్లు గుర్తించారు. ఈ స్థాయిల్లో ఎసిడిటీకి గురైనవారికి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు తప్పదు. మధుమేహం, గ్యాస్ట్రిటీస్, ఊబకాయం, రక్తపోటు వంటి సమస్యలు ఎదుర్కొంటారు. ఇకపై మీకు గానీ, మీ చిన్నారులకు గానీ ఇటువంటి సమస్యలు తలెత్తినట్లయితే.. హాట్ చిప్స్, స్నాక్స్‌కు దూరంగా ఉండండి. అలాగే, ఎఫ్‌డీయేకు ఫిర్యాదు చేయండి. దీనివల్ల మీ పిల్లలే కాదు, మరింత మంది చిన్నారులకు మేలు జరుగుతుంది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







