మిస్ వరల్డ్ 2019 విజైత జమైకా భామ
- December 15, 2019
ప్రపంచ సుందరి 2019 విజేతలను మిస్ వరల్ట్ కమిటీ శనివారం ప్రకటించింది. ఎక్సెల్ లండన్‌లో వివిధ దేశాలకు చెందిన భామల అభిప్రాయాలను సేకరించి విజేత వివరాలను వెల్లడించింది. జమైకా భామను ప్రపంచ సుందరి కిరీటం వరించింది. భారతదేశానికి చెందిన సుమన్ రావు రెండో రన్నరప్‌గా నిలిచారు.
మిస్ వరల్డ్ 2019
టోని ఆన్ సింగ్ 2019 ప్రపంచ సుందరిగా ఎంపికయ్యారు. కమిటీ ఆమెను మిస్ వరల్డ్‌గా సెలక్ట్ చేసినట్టు ప్రకటించింది. సమావేశ మందిరంలో కరతాళధ్వనుల మధ్య సంతోషంతో ఉబికి వస్తోన్న కన్నిటీకి ఆపుకొని చేయి ఊపారు. 2018 మిస్ వరల్డ్ వన్నెసా పొన్సే.. టోని ఆన్ సింగ్‌కు ప్రపంచ సుందరి కిరీటాన్ని పెట్టారు.
ఫస్ట్, సెకండ్ రన్నరప్..
ఫ్రాన్స్‌కు చెందిన ఒప్లే మెజినో మొదటి రన్నరప్‌గా నిలిచారు. ఇండియాకు చెందిన సుమన్ రావు రెండో రన్నరప్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. రాజస్థాన్‌కి చెందిన సుమన్ రావు (20).. 2019లో మిస్ ఇండియాగా ఎంపికయ్యారు. తర్వాత ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొన్నారు.
చదువుతూనే
సుమన్ రావు గత కొన్ని నెలలుగా మోడలింగ్ చేస్తున్నారు. చదువుకుంటూనే మోడలింగ్ చేయడం విశేషం. 2019లో మిస్ ఇండియాగా గెలుపొందిన తర్వాత లింగ సమానత్వం కోసం పోరాడుతానని సుమన్ రావు పేర్కొన్న సంగతి తెలిసిందే. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉద్యమిస్తానని ఆమె తెలిపారు.
టాప్-5
ప్రపంచ సుందరి 2019లో టాప్ ఐదుగురిని ఎంపికచేశారు. వారిలో ఆన్ సింగ్, మెజినో, సుమన్ రావు ఉన్నారు. బ్రిటిష్ బ్రాడ్‌కాస్టర్ పియర్స్ మోర్గన్ ఐదుగురుని వివిధ అంశాలపై ప్రశ్నించి.. ప్రపంచ సుందరి టోని ఆన్ సింగ్, మొదటి రన్నపర్ ఒప్లే మెజినో, రెండో రన్నరప్ సుమన్ రావును ప్రకటించారు.
120 దేశాల నుంచి
మిస్ వరల్డ్ 2019కి 120 దేశాల నుంచి మహిళలు పాల్గొన్నారు. ఈ ఏడాది నిర్వహించిన పోటీ 69వదని నిర్వాహకులు తెలిపారు. నవంబర్ 30వ తేదీ నుంచి లండన్‌లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. కొన్ని వారాల తర్వాత టాప్ పది మందిని ఫైనల్‌కు ఎంపికచేశారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







