దుబాయ్ లో అతిపెద్ద IKEA స్టోర్

- December 15, 2019 , by Maagulf
దుబాయ్ లో  అతిపెద్ద IKEA స్టోర్

దుబాయ్: దుబాయ్ లోని IKEA అనగానే మనకి గుర్తోచ్చేది 'దుబాయ్ ఫెస్టివల్ సిటీ' లోని అతిపెద్ద IKEA స్టోర్..ఇప్పుడు ఆ అభిప్రాయం మార్చుకోవలసిందే..ఎందుకంటే యూఏఈ లోనే అతిపెద్దదైనటువంటి IKEA Store దుబాయ్ లోని జెబెల్ అలీ లో ప్రారంభంకానుంది. ఇందులో 500 మంది కూర్చునే సౌకర్యంతో IKEA Café కూడా ఉండనుంది.

డిసెంబర్ 18 జెబెల్ అలీ లోని కొత్త ఫెస్టివల్ ప్లాజా మాల్‌తో పాటు ఈ గ్రాండ్ స్టోర్ ను ప్రారంభించనున్నారు. గ్రాండ్ ఓపెనింగ్ కోసం, స్టోర్ మొదటి 1,000 మంది సందర్శకులకు స్టోర్లో ఖర్చు చేయడానికి 1,000 దిర్హాముల విలువైన గిఫ్ట్ వోచర్‌లను గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇవి మాత్రమే కాదు, ప్రారంభ రోజున IKEA లోకి ప్రవేశించిన మొదటి కొద్ది మంది కస్టమర్లకు ఐకానిక్ IKEA ఉత్పత్తులను కలిగి ఉన్న ప్రత్యేక బహుమతి ఇవ్వనున్నారు.

జెబెల్ అలీలోని ఫెస్టివల్ ప్లాజా మాల్ లో ప్రారంభంకానున్న కొత్త స్టోర్ గురించి మరింత సమాచారం కోసం www.ikea.com/ae లో పొందగలరు

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com