ఢిల్లీలో పౌరసత్వ నిరసన జ్వాలలు
- December 15, 2019
ఢిల్లీ: భారత దేశ రాజధానిలో పౌరసత్వ సవరణ చట్టం నిరసన ప్రదర్శనలు మరింత ఉగ్రరూపం దాల్చాయి. హింసాత్మకంగా తయారయ్యాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కొద్దిరోజులుగా ప్రదర్శనలు నిర్వహిస్తోన్న ఆందోళనకారులు.. ఆదివారం మరింత రెచ్చి పోయారు. బస్సులకు తగుల బెట్టారు. ఈ చర్యకు జామియా యూనివర్శిటీ విద్యార్థులే కారణమంటూ మొదట్లో వార్తలు తలెత్తాయి. యూనివర్శిటీ విద్యార్థి సంఘాల ప్రతినిధులు మాత్రం దీన్ని కొట్టి పారేశారు. ఆ చర్య తమది కాదని స్పష్టం చేశారు.
వేర్వేరు ప్రాంతాల్లో బస్సులపై దాడి..
ఢిల్లీలోని ఇండియా గేట్ సహా పలు ప్రాంతాల్లో కొద్దిరోజులుగా జామియా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. ఆదివారం సాయంత్రం న్యూ ఫ్రెండ్స్ కాలనీ, ఆశ్రమ్ ఫ్లైఓవర్, సుఖ్ దేవ్ విహార్ సహా కొన్ని ప్రాంతాల్లో ఆందోళనకారులు ఢిల్లీ ప్రజా రవాణా సంస్థ బస్సులను తగులబెట్టారు. మరి కొన్నింటి అద్దాలను పగుల గొట్టారు. దీనితో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







