యూఏఈ: 27 ఏళ్ల తర్వాత సొంతింటికి తిరిగొస్తున్న 'కేరళ కాప్' మనాయిల్ ఫసల్

- December 17, 2019 , by Maagulf
యూఏఈ: 27 ఏళ్ల తర్వాత సొంతింటికి తిరిగొస్తున్న 'కేరళ కాప్' మనాయిల్ ఫసల్

యూఏఈ:మనాయిల్ ఫసల్...మూడు దశాబ్దాలుగా వివిధ రంగాలకు చెందిన ఎందరో ప్రముఖులకు సెక్యూరిటీ గార్డుగా పని చేసిన వ్యక్తి. సూదీర్ఘ కాలంగా ఫసల్ చేసిన సేవలకుగాను 'కేరళ కాప్' గా ఆయన గుర్తింపు పొందాడు. 27 సంవత్సరాలుగా కుటుంబానికి దూరంగా వీవీఐపీల భద్రత బాధ్యతలే లోకంగా సేవలు అందించిన 50 ఏళ్ల మనాయిల్ ఫసల్(కేరళ కాప్) ఎట్టకేలకు తన బాధ్యతలకు వీడ్కోలు చెప్పి సోమవారం స్వదేశానికి చేరుకున్నారు.

కొన్నేళ్ల కిందట యూఏఈ వలసవెళ్లిన భారత కుటుంబం నుంచి వచ్చిన ఫసల్..బాడీ గార్డుగా విధులు నిర్వహించేందుకు దుబాయ్ పోలీసుల నుంచి ప్రత్యేక అనుమతి పొందారు. తన 27 ఏళ్ల కేరీర్లో దాదాపు 2,500 ఈవెంట్లలో వీఐపీలకు సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహించినట్లు ఫసల్ తెలిపారు. ఇక నుంచి తన బాధ్యతలను నలుగురి కుమారుల్లో మొహమ్మద్ ఫవాజ్ కు అప్పగించనున్నట్లు వెల్లడించారు.

తన సర్వీసులో ఇప్పటివరకు ఎంతోమంది ఇండియన్, యూఏఈకి చెందిన సినీ తారలు, రాజకీయ నాయకులు, మంత్రులు, దౌత్యవేత్తలు, క్రికెటర్లు, కళాకారులు, గాయకులు, నృత్యకారులు, రచయితలు, కవులకు భద్రత అందించినట్లు ఫసల్ తన అనుభవాలను వివరించాడు. ఇన్నాళ్ల తన సర్వీసులో ఎన్నో మధుర జ్ఞాపకాలతో ఇంటికి చేరుకున్నట్లు సంతోషం వ్యక్తం చేశాడు. తన ఫేస్ బుక్ లో 7,000 మంది ప్రముఖులతో తీసుకున్న ఫోటోలు ఉన్నాయని, అవే తనకు అతిపెద్ద నిధి అని అన్నారాయన.

ఇక్కడ మరో విశేషం ఏంటంటే 14 ఏళ్ల విరామం తర్వాత ఇప్పుడా కుటుంబం ఐదో సంతానం కోసం వేచి చూస్తోంది. తన భార్యను జాగ్రత్తగా చూసుకునేందుకు ఆయన స్వదేశానికి తిరగొచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com