దుబాయ్:అనధికారిక డ్రైవింగ్ ఇన్స్టిట్యూషన్స్ పై ఆర్టీఏ కొరఢా
- December 17, 2019
దుబాయ్:అనధికారికంగా డ్రైవింగ్ ఇన్స్టిట్యూషన్ నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ హెచ్చరించింది. ఆర్టీఏ నుంచి అనుమతి లేకుండా డ్రైవింగ్ కోర్సులు నిర్వహిస్తే 10,000 దిర్హామ్ ల ఫైన్ విధిస్తామని అధికారులు వెల్లడించారు. డ్రైవింగ్ కోర్సుల కోసం లైసెన్స్ లేని వాహనాలను వినియోగిస్తే 5,000 దిర్హామ్ లు ఫైన్ విధించనున్నట్లు స్పష్టం చేశారు.
డ్రైవింగ్ నేర్పిస్తామంటూ చాలామంది వ్యక్తిగతంగా పత్రికలు, ఆన్ లైన్లో ప్రకటనలు ఇస్తున్నారని, ఇందుకు 50 నుంచి 100 దిర్హామ్ వరకు ఛార్జ్ చేస్తున్నారు. చౌకగా డ్రైవింగ్ నేర్చుకునేందుకు ఇలాంటి అనధికారక డ్రైవింగ్ కోర్సుల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని వివరించింది. ఆర్టీఏ టెస్టుల్లోనూ సహకరిస్తామనే ప్రకటనలు కూడా డ్రైవింగ్ నేర్చుకోవాలని అనుకునేవారి ఆకర్షిస్తున్నాయని పేర్కొంది. అలాంటి ప్రకటనలను తేలిగ్గా తీసుకోవటం లేదని ఆర్టీఏ సీఈవో యూసెఫ్ అల్ అలీ స్పష్టం చేశారు. సంబంధిత అధికారులు మానిటర్ చేస్తున్నామని హెచ్చరించారు. డ్రైవింగ్ నేర్చుకోవాలని అనుకునేవాళ్లు ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన ఇన్స్టిట్యూషన్ లోనే నేర్చుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







