నటి జయసుధ కొత్త అవతారం

- December 17, 2019 , by Maagulf
నటి జయసుధ కొత్త అవతారం

టాలీవుడ్ లో సహజనటిగా గుర్తింపు తెచ్చుకున్న జయసుధ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పాత్రలకు జీవం పోసి స్టార్‌ హీరోలకు దీటుగా ఆమె నటన తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. దాదాపు 44 ఏళ్ళగా వెండి తెరపై తిరుగులేని నటిగా ప్రేక్షకులను మెప్పించిన జయసుధ 1958, డిసెంబర్‌ 17న మద్రాసులో జన్మించింది. అప్పట్లోనే తనదైన నటనే కాదు..అందంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది. సీనియర్ నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో నటించి వారి ప్రశంసలు అందుకున్నారు. టీచర్‌ కావాలనుకున్న జయసుధను సినీ రంగంపై మక్కువ పెరగడానికి ఆమె మేనత్త.. ప్రముఖ నటి, డైరెక్టర్, నిర్మాత విజయనిర్మల. జయసుధ నాన్నమ్మ ప్రోత్సాహంతో, విజయ నిర్మల సహకారంతో 1972లో 'పండంటి కాపురం' మూవీతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఇందులో అలనాటి నటి జమునకు కూతురిగా నటించారు.


కె.బాలచందర్‌ దర్శకత్వంలో నటించే అరుదైన అవకాశాన్ని దక్కించు కున్నారు. ఆయన తెరకెక్కించిన 'అరంగేట్రం', 'అపూర్వ రాగంగళ్‌' చిత్రాల్లో నటించారు. ఆమె తొలి హిట్‌ 'అపూర్వ రాగంగళ్‌'. ఇక కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన 'జ్యోతి' చిత్రంతో టాలీవుడ్‌లో తొలి బ్రేక్‌ అందుకున్నారు. జయసుధ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో నటించారు. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత ఆమె తల్లి, అత్త, అమ్మమ్మ పాత్రల్లో నటిస్తున్నారు.


రాజకీయాల్లో సైతం జయసధ అడుగు పెట్టారు. ప్రస్తుతం ఆమె వైసీపీలో కొనసాగుతున్నారు. తాజాగా జయసుధ నటిగానే కాకుండా సింగర్ గా మెప్పించారు. జయసుధ ఎప్పుడో క్రిస్టియానిటీ కూడా తీసుకున్నారు. అయితే మరికొన్ని రోజుల్లో క్రిస్మస్ పండగ రానుంది. ఈ సందర్భంగా ఆమె జీసస్‌పై పాడిన ఓ పాట ఇప్పుడు వైరల్ అవుతోంది. తాజాగా ఈ విషయాన్ని సంచలన దర్శకుడు ఆర్.జి.వి ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. జయసుధ కొత్త అవతారం అంటూ ట్వీట్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com