తలైవా 168 సినిమా షూటింగ్ ప్రారంభం

- December 18, 2019 , by Maagulf
తలైవా 168 సినిమా షూటింగ్ ప్రారంభం

హైదరాబాద్:సూపర్ స్టార్ రజినీకాంత్ 168 చిత్రం శివ దర్శకత్వంలో రాబోతున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఈ చిత్రం యొక్క షూటింగ్ రామోజీఫిలిం సిటీ లో ప్రారంభమైంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ట్యాలెంటెడ్ బ్యూటీ కీర్తి సురేష్ , మీనా , కుష్బూ , ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదలకానుంది.

ఇక ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో రజనీ నటించిన దర్భార్ చిత్రం వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న రాబోతుంది. ఈ చిత్రంలో నయనతార కథానాయిక. రజినీ-మురగదాస్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో దర్బార్ పై తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి. బాలీవుడ్ ప్రముఖ నటులు సునీల్ శెట్టి , ప్రతీక్ బబ్బర్ , దిలీప్ తాహిల్ , జతిన్ సర్ణ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com