హైదరాబాద్ లో 'దబంగ్ 3' ప్రీ రిలీజ్ ఈవెంట్

- December 18, 2019 , by Maagulf
హైదరాబాద్ లో 'దబంగ్ 3' ప్రీ రిలీజ్ ఈవెంట్

హైదరాబాద్:బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ప్రస్తుతం దబంగ్ 3 అంటూ రచ్చ చేసేందుకు రెడీ అవుతున్నాడు. చుల్‌బుల్ పాండేగా సల్మాన్ చేసిన హల్ చల్ అందరికీ తెలిసిందే. దబంగ్, దబంగ్2 చిత్రాలతో బాక్సాఫీస్ పని పట్టిన సల్మాన్ మూడోసారి దండయాత్ర చేసేందుకు వస్తున్నాడు. ఈ క్రమంలో తెలుగు మార్కెట్‌పైనా భాయ్ కన్నేసినట్టు తెలుస్తోంది. ఈ మూవీని తెలుగులో ప్రమోట్ చేసేందుకు స్వయంగా రంగంలోకి దిగాడు. నేడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అంగరంగవైభవంగా నిర్వహించారు.

రామ్ చరణ్, వెంకీలు ముఖ్య అతిథులుగా..
సల్మాన్ హైద్రాబాద్‌కు వస్తున్నాడంటే.. రామ్ చరణ్ ఆయన వెంట ఉంటాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనుకున్నట్టుగానే ఈ వేడుకకు రామ్ చరణ్ హాజరయ్యాడు. చెర్రీతో పాటే వెంకీమామతో హిట్ కొట్టి ఫుల్ జోష్‌లో ఉన్న వెంకటేష్ కూడా మెరిసాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com