గల్ఫ్ ఉత్తరం... గుండెల్లో దాచుకునే ఒక అపురూప జ్ఞాపకం

- December 18, 2019 , by Maagulf
గల్ఫ్ ఉత్తరం... గుండెల్లో దాచుకునే  ఒక అపురూప జ్ఞాపకం

తెలంగాణ:స్మార్ట్ ఫోన్ ల వలన ఉత్తరాలు రాయడం మర్చిపోయిన నేపథ్యంలో...  గల్ఫ్ దేశాలలో ఉన్న తన తండ్రికి ఉత్తరం రాయించి విద్యార్థులకు ఉత్తరాలు రాసే అలవాటును ప్రోత్సహించడం కోసం విద్యార్థులకు ఉత్తరాల పోటీ నిర్వహిస్తున్నట్లు ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సయిండ్ల రాజిరెడ్డి అన్నారు. అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం సందర్బంగా జగిత్యాల మండలం లక్ష్మీపూర్ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు తమ యూనియన్, ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, గల్ఫ్ ఉత్తరం... గుండెల్లో దాచుకునే  ఒక అపురూప జ్ఞాపకం అని ఆయన అన్నారు. 

ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ అనే కేంద్ర ప్రభుత్వ పెన్షన్ పథకం, విదేశాల్లో ఉన్న భారతీయులకు వర్తించే నేషనల్ పెన్షన్ సిస్టం అనే పథకం, స్వచ్ఛ భారత్ అనే కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలతో పాటు రైతు బంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి విద్యార్థులకు వ్యాస రచనను గల్ఫ్ కు ఉత్తరాలు రాసే విధానంలో పోటీలు నిర్వహిస్తున్నామని యూనియన్ అధ్యక్షులు స్వదేశ్ పరికిపండ్ల అన్నారు. గల్ఫ్ లో ఉన్న తండ్రి నుండి జవాబు వచ్చిన తర్వాత ఉత్తమ ఉత్తరాలకు బహుమతులు ప్రధానం చేస్తామని ఆయన అన్నారు. 

ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు వి. జయపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు సత్యనారాయణ, కోటేశ్వర్ రావు, జె. జాస్మిన్, సరోజన, కె. విజయ, డి. విజయ లు పాల్గొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com