అబుధాబి: వాహనదారులకు బంపర్ ఆఫర్..బకాయి చలాన్లపై 50% డిస్కౌంట్
- December 18, 2019
అబుధాబి:ట్రాఫిక్ చలాన్ల బకాయిలను వసూలు చేసేందుకు ఎమిరైతీ అధికారులు కొత్త కొత్త స్కీమ్ లను అమలు చేస్తున్నారు. ట్రాఫిక్ చలాన్ బకాయి 1000 దిర్హామ్ ల కంటే ఎక్కువగా ఉంటే వాయిదా పద్దతుల్లో డ్యూస్ చెల్లించేలా ఇటీవలె అజ్మన్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అబుధాబి ట్రాఫిక్ పోలీసులు కూడా బకాయి వసూళ్ల కోసం ఓ అఫర్ ప్రకటించింది. వాహనదారులకు చలాన్ల బకాయిలపై 50% డిస్కౌంట్ ప్రకటించింది. ఈ నెల 22కి ముందు 3 నెలల టైమ్ పిరీయడ్ లోని చలాన్లకు మాత్రమే ఈ వెసులుబాటు వర్తిస్తుంది.
ఫైన్ డ్యూస్ తో పాటు జరిమానాలను త్వరగా చెల్లించే వారికి రాయితీలు కూడా ప్రకటించింది. 60 రోజుల్లో ఫైన్ డబ్బులు చెల్లిస్తే 35% డిస్కౌంట్, ఫైన్ విధించిన ఏడాదిలోనే డ్యూస్ చెల్లించే వారికి 25% తగ్గింపు ఇవ్వనున్నట్లు ఇవ్వనున్నట్లు అబుధాబి ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఈ నెల 22 తరువాత విధించే ఫైన్స్ పై రిడక్షన్ అమలులోకి వస్తుందని తెలిపారు. అయితే..స్వాధీనం చేసుకున్న వాహనాలకు, లేట్ ఫైన్ల విషయంలో ఎలాంటి డిస్కౌంట్లు ఉండవని క్లారిటీ ఇచ్చారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







