ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్
- December 19, 2019
హైదరాబాద్: ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటారు. టీఆర్ఎస్ MP జోగినపల్లి సంతోష్‌కుమార్ శ్రీకారం చుట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం దేశ, విదేశాల్లో అప్రతిహతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్ అసోసియేషన్ తమ వంతు బాధ్యతగా గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటింది. ప్రతి రోజు పండగే మూవీ టీంతో పాటు GHMC మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ బంజారాహిల్స్‌లోని శ్రీనికేతన్ కాలనీ పార్క్‌లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ.. హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాలు చాలా బాగా విజయవంతం అయ్యాయన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఖండాంతారాలు దాటింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే క్రాంతికిరణ్ మాట్లాడుతూ..
ప్రకృతిని కాపాడుకోవడం అందిరి బాధ్యతన్నారు. ప్రకృతిని కాపాడుకోవడంలో అందరూ చేతులు కాపాలని పిలుపునిచ్చారు. హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం తనను ఎంతగానో ఆకర్షించిందన్నారు.
ఈ కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రతిఒక్కరూ తమ బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. పర్యావరణాన్ని రక్షించుకోవడం అందరి బాధ్యతని పేర్కొన్నారు. హీరోయిన్ రాశీ ఖన్నా మాట్లాడుతూ..
ప్రస్తుత పరిస్థితుల్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చాలా అవసరం అన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యతన్నారు. దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వామ్యం అవడం బాధ్యతగా తీసుకోవాలన్నారు. తాము మొక్కలు నాటడమే కాకుండా మరో ముగ్గురు చేత మొక్కలు నాటించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఛాలెంజ్ కోఆర్డినేటర్ రాఘవ, సహా నిర్మాత SKN, ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు వై.జె రాంబాబు, శేఖర్, ప్రధాన కార్యదర్శి నాయుడు, కాలనీ వాసులు పాల్గొన్నారు.



తాజా వార్తలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!







