మృత శిశువును చెత్తకుప్పలో పడేసిన తల్లికి 6 నెలల జైలు శిక్ష
- December 20, 2019
దుబాయ్:అప్పుడే పుట్టిన బిడ్డను చెత్తకుప్పలో పడేసిన కేసులో తల్లికి ఆరు నెలల జైలుశిక్ష విధించింది దుబాయ్ కోర్టు. ఆమెకు సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులకు మూడు నెలల జైలు శిక్ష ఖరారు చేసింది. ఇల్లీగల్ అఫైర్ వల్లే ఈ దారుణానికి ఓడిగట్టినట్లు రుజువు కావటంతో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఫిలిపినాకు చెందిన 35 ఏళ్ల
మహిళ ఫిలిపిన, పాకిస్తాన్ కు చెందిన ఇద్దరు వ్యక్తులతో కొన్నాళ్లుగా ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంది. ఫలితంగా ప్రెగ్నెన్స్ రావటంతో మృతిచెందిన బిడ్డకు జన్మనిచ్చింది. ఆ ముగ్గురు కలిసి బేబి డెడ్ బాడీని ప్యాక్ చేసి అల్ బరాహా ప్రాంతంలోని చెత్తకుప్పలో పడేశారు.
అయితే..చెత్తకుప్పలో చిన్నారి డెడ్ బాడీ ఉన్నట్లు గుర్తించిన పోలీసులు..కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 38 ఏళ్ల పాకిస్తానీ బేబీని చెత్తకుప్పలో వేసినట్లు నిర్ధారించుకొని అతన్ని అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేయటంతో అసలు విషయం బయటపడింది. చిన్నారి డెడ్ బాడీని ప్యాక్ చేసి ఇచ్చిన 50 ఏళ్ల ఫిలిపిన వ్యక్తితో పాటు ఆ
తల్లిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ఆ తల్లి కూడా నిజాలను ఒప్పుకుంది. దీంతో దుబాయ్ కోర్టు తల్లికి ఆరు నెలల జైలు శిక్ష..ఆమెకు సహకరించిన పాకిస్తానీ, ఫిలిపిన వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష విధించింది. అంతేకాదు...ఫిలిపినకు చెందిన ఇద్దరి వీసా ఎక్స్ పైర్ కావటంతో ఆ ఇద్దరికి అదనంగా మరో నెల జైలు శిక్షను ఖరారు
చేసింది కోర్టు.
తాజా వార్తలు
- పీఎం ఇంటర్న్‌షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!







