ఫిలిం ఫేర్ అవార్డ్స్ లో 'రంగస్థలం' హవా

- December 22, 2019 , by Maagulf
ఫిలిం ఫేర్ అవార్డ్స్ లో 'రంగస్థలం' హవా

చెన్నై వేదికగా శనివారంరోజు ప్రతిష్టాత్మక ఫిలిం ఫేర్ అవార్డుల కార్యక్రమం వైభవంగా జరిగింది. ఫిలిం ఫేర్ అవార్డ్స్ లో రంగస్థలం చిత్ర హవా స్పష్టంగా కనిపించింది. ఏకంగా ఐదు విభాగాలలో రంగస్థలం ఫిలిం ఫేర్ అవార్డ్స్ సొంతం చేసుకోవడం విశేషం. 

ఉత్తమ నటుడిగా రాంచరణ్(తెలుగు),  ఉత్తమ సహాయ నటిగా అనసూయ, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఉత్తమ లిరిసిస్ట్ చంద్రబోస్  ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ అవార్డులు గెలుచుకున్నారు. ఇక ఉత్తమ నటిగా కీర్తి సురేష్, ఉత్తమ దర్శకుడిగా నాగ్ అశ్విన్ మహానటి చిత్రానికి అవార్డులు అందుకున్నారు. 

కొన్ని రోజుల క్రితం ప్రకటించిన జాతీయ అవార్డులలో రంగస్ధలం చిత్రానికి ఆడియో మిక్సింగ్ విభాగంలో అవార్డు దక్కింది.  రాంచరణ్ కు అవార్డు రాకపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. ఇప్పుడు ఫిలిం ఫేర్ లో రాంచరణ్ కు ఉత్తమ నటుడిగా అవార్డు దక్కడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాంచరణ్ కు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com