యూఏఈ నేషనల్ బ్రాండ్ : వారంలో 1.5 మిలియన్ ఓటింగ్
- December 22, 2019
యూఏఈ నేషనల్ బ్రాండ్ సెలక్ట్ చేసేందుకు చేపట్టిన ఓటింగ్ కు జనం నుంచి భారీ స్పందన వచ్చింది. కేవలం వారం రోజుల్లో 1.5 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. 130 దేశాలు..2000 సిటీస్ నుంచి ఈ ఓట్లు పోల్ అయ్యాయి. యూఏఈ గ్లోబల్ లోగో ఎంపిక చేసేందుకు గత మంగళవారం నుంచి ఓటింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం మూడు లోగోలు 'ఎమిరేట్స్ ఇన్ కాలిగ్రాఫి', 'ది పామ్' మరియు '7 లైన్స్' లలో ఒక లోగోను సెలక్ట్ చేయాల్సి ఉంది. లోగో ఓటింగ్ తో పాటు వెబ్ సైట్ వ్యూస్ కూడా అంతే భారీ సంఖ్యలో ఉన్నాయి. లోగో క్యాంపేన్ చేపట్టిన నాటి నుంచి www.nationbrand.ae వెబ్ సైట్ కు దాదాపు 50 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆన్ లైన్ ఓటింగ్ తో పాటు ఫిజికల్ ఓటింగ్ కూడా చేపట్టిన అధికారులు..పలు మాల్స్ లో పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. అబుదాబి- యస్ మాల్, దుబాయ్- గ్లోబల్ విలేజ్ & సిటీ వాక్, షార్జా- సిటీ సెంటర్, అజ్మన్ - సిటీ సెంటర్ , రస్ అల్ ఖైమా - సిటీ సెంటర్, ఫుజైరహ్ - సిటీ సెంటర్ మాల్స్ లో ఓట్ పోల్ చేయొచ్చు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..