షార్జా: గోడౌన్స్ పై సర్ ప్రైజ్ రైడ్స్..బ్యాన్డ్ ఐటమ్స్ సీజ్

- December 22, 2019 , by Maagulf
షార్జా: గోడౌన్స్ పై సర్ ప్రైజ్ రైడ్స్..బ్యాన్డ్ ఐటమ్స్ సీజ్

షార్జాలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన షార్జా మున్సిపాలిటీ అధికారులు..రెండు గోడౌన్ల నుంచి పెద్ద ఎత్తున బ్యాన్డ్ ఐటమ్స్ తో పాటు నిశ్వార్ ను సీజ్ చేశారు. గత కొంత కాలంగా ఈ రెండు గోడౌన్లలో అనుమానస్పద కదలికలను అధికారులు గుర్తించారు. దీంతో రెండు చోట్ల నిఘా బ్రుందాలను మోహరించారు. బ్యాన్డ్ గూడ్స్ ను భారీగా స్టోర్ చేసినట్లు నిర్ధారించుకొని మెరుపు దాడులు చేపట్టారు. రైడ్ చేసిన సమయంలో అక్కడ పని చేస్తున్న చాలామంది ఆసియన్లు పారిపోయినట్లు ఇన్స్ పెక్షన్ & సిటీ కంట్రోల్ డైరెక్టర్ మొహమ్మద్ అల్ కబ్బి తెలిపారు. సీజ్ చేసిన గూడ్స్ ను సినీ ఫక్కీలో రహస్యంగా దాచిపెట్టి అనుమానం రాకుండా వాల్ డెకార్ తో కవర్ చేశారని వివరించారు. సీజ్ చేసిన సామాగ్రిని ధ్వంసం చేసిన అధికారులు..గోడౌన్ ఓనర్స్ ను పాసిక్యూట్ చేసేందుకు షార్జా పోలీసులకు అప్పగించారు. సిటీలో ఇల్లీగల్ బిజినెస్ లపై నిఘా పెట్టేందుకు షార్జా మున్సిపాలిటీ 40 టీమ్స్ ను ఏర్పాటు చేసింది. అనుమానం వచ్చిన ప్రాంతంలో ఈ టీమ్స్ ఆకస్మిక తనిఖీలు చేపడుతుంది. ఇదిలాఉంటే మున్సిపాలిటీ అధికారులు ఇల్లీగల్ పాప్ అప్ మార్కెట్ లో చేపట్టిన మరో సోదాలో నిశ్వార్,  ఎక్స్ పైర్ ఫుడ్, ఫేక్ ప్రొడక్ట్స్ అమ్ముతున్న మొబైల్ వెండర్స్ ని అదుపులోకి తీసుకున్నారు. సోదాల్లో పట్టుబడిన వారంతా దేశంలో ఇల్లీగల్ గా ఉంటున్నట్లు గుర్తించారు. వీరిలో కొందరు పోలీసుల వాంటెడ్ లిస్ట్ లో కూడా ఉన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com