'దిశ' నిందితులకు రేపే రీపోస్టుమార్టం.. 50 శాతం కుళ్లిపోయిన మృతదేహాలు..
- December 22, 2019
తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం నిర్వహించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. తెలంగాణతో సంబంధంలేని డాక్టర్లతో ప్రక్రియ చేపట్టాలని కోర్టు షరతు విధించింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ రిక్వెస్ట్ మేరకు.. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్).. నలుగురు నిపుణులతో కూడిన టీమ్ ను హైదరాబాద్ పంపేందుకు అంగీకరించింది.
రేపు ఉదయం 9 గంటలకు ప్రక్రియ..
ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్తా ఆధ్వర్యంలోని టీమ్.. ఆదివారం సాయంత్రానికే హైదరాబాద్ చేరుకోనుంది. డాక్టర్ ఆదర్శ్ కుమార్, డాక్టర్ అభిషేక్ యాదవ్, డాక్టర్ వరుణ చంద్ర టీమ్ సభ్యులుగా ఉన్నారు. వీరంతా సోమవారం ఉదయం 9 గంటలకు గాంధీ ఆస్పత్రి మార్చురీలో రీపోస్టుమార్టం ప్రారంభిస్తారు. ప్రక్రియ మొత్తాన్నీ వీడియో తీసి, కలెక్షన్స్ ఆఫ్ ఎవిడెన్స్‌ను సీల్డ్ కవర్‌లో భద్రపరుస్తారు.
సోమవారమే నలుగురి అత్యక్రియలు!
రీపోస్టుమార్టం పూర్తయిన వెంటనే నలుగురు నిందితుల మృతదేహాలను వారి బంధువులకు అప్పగించాలని హైకోర్టు చెప్పింది. సోమవారం ఉదయమే రీపోస్టుమార్టం ప్రక్రియ మొదలుకానుంది. సాయంత్రంలోగా బాడీలను బంధువులకు అప్పగించడంతోపాటు సోమవారమే అంత్యక్రియలు జరిపించేలా ఆయా కుటుంబాలను పోలీసులు ఒప్పించినట్లు తెలుస్తున్నది.
ఇప్పటికే 50 శాతం కుళ్లిపోయిన మృతదేహాలు
దిశ నిందితుల మృతదేహాలు ఇప్పటికే 50 శాతం కుళ్లిపోయాయని, వాటిని మైనస్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ప్రీజర్‌లో ఉంచామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ హైకోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారంనాటి రీపోస్టుమార్టం ఎయిమ్స్ డాక్టర్లకు సవాలు లాంటిదనే చెప్పాలి. ఈనెల 6న షాద్ నగర్ సమీపంలోని చటాన్ పల్లి వద్ద దిశ నిందితులు పోలీసుల కాల్పుల్లో చనిపోయారు. ఎన్ కౌంటర్ పై అనుమానాలు వ్యక్తం చేస్తూ మహిళా సంఘాలు కోర్టును ఆశ్రయించడంతో అత్యక్రియల ప్రక్రియ వాయిదాపడుతూ వచ్చింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







