ఫేస్బుక్ వినియోగదారులకు మరో షాక్
- December 22, 2019
వియత్నాం: 26.7కోట్ల ఫేస్బుక్ వినియోగదారుల డేటా వివరాలు హ్యాకర్ల చేతికి చిక్కాయి. వారికి సంబంధించిన సున్నిత వివరాలను హ్యాకర్లు హస్తగతం చేసుకున్నట్లు కంపారిటెక్ సంస్థకు చెందిన సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ జాబ్ డయాచెక్ నో గుర్తించారు. ఈ సంవత్సరంలో ఏకంగా ఇది మూడోసారి. ఈ సారి హ్యాకర్ల చేతిలో ఫేస్బుక్ యూజర్ల విశిష్ట సంఖ్య(యూఐడి) కూడా ఉందని ఇది అందరిని ఆందోళనలోకి నెట్టే అంశమని జాబ్ తెలియజేశారు. వియత్నాం కేంద్రంగా హ్యాకర్లు రెచ్చిపోయారని, అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వివరాలను హ్యాక్ చేయకుండా ఉండాలంటే సెండ్ డేటా టూ సెర్చింజన్స్ అనే ఆప్షన్ను వెంటనే డిసేబుల్ చేస్తే సరిపోతుందని అన్నారు. ఇక తమ వినియోగదారుల సమాచారాన్ని కాపాడటంలో ఫేస్ బుక్ సైబర్ సెక్యూరిటీ వింగ్ పదేపదే విఫలం అవుతుండటంపైనా ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత సంవత్సరం అక్టోబరులో 2.90 కోట్ల మంది డేటాను హ్యాకర్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఫేస్ బుక్ యాజమాన్యం స్వయంగా వెల్లడించింది. ఆపై డిసెంబరులో 68 లక్షల మంది వినియోగదారుల డేటా లీక్ కాగా, క్షమాపణలు కూడా చెప్పింది. ఆపై ఏప్రిల్ లో 54 కోట్ల మంది. సెప్టెంబరులో 41.9 కోట్ల మంది డేటా లీకయ్యింది.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







