హైదరాబాద్:ఉద్యోగాల పేరుతో దుబాయ్ కు యువతులు..
- December 25, 2019
హైదరాబాద్:హైదరాబాద్ నగరంలో ఆర్థిక సమస్యలతో బాధపడే యువతులను టార్గెట్ చేసి లక్షల రూపాయలు దండుకుంటోన్న కి'లేడీ'ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఉద్యోగాల కోసం వెతుకుతున్న అమ్మాయిలను దుబాయ్ కి పంపి లక్షల్లో దండుకుంటున్న కిలేడీలను పట్టుకున్నారు. ఈ కి'లేడీ'ల ఉచ్చులో పడి కొన్ని నెలల క్రితం ఒక యువతి షార్జాకు వెళ్లి హైదరాబాద్ కు తిరిగి రావడంతో కి'లేడీ'ల బాగోతం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు హైదరాబాద్ కు వచ్చిన తరువాత తమ గురించి ఎవరికైనా చెబితే చంపేస్తామని కి'లేడీ'లు బెదిరించడం గమనార్హం. కి'లేడీ'లు బాధితురాలికి పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం ఉండదని పోలీసులు కూడా తమ గుప్పిట్లోనే ఉన్నారని బెదిరించారు. పూర్తి వివరాలలోకి వెళితే అయేషా సిద్ధికా బేగమ్ అనే యువతి హైదరాబాద్ లోని యాకుత్ పురాలో నివాసం ఉంటోంది. చదువు పూర్తయిన తరువాత ఉద్యోగాల కోసం వెతుకుతున్న అయేషాకు ఇద్దరు మహిళలు పరిచయం అయ్యారు. మహిళలు అయేషాకు దుబాయ్ లో నెలకు 30,000 రూపాయల జీతంతో ఉద్యోగం ఇప్పిస్తామని దంపతుల ఆలనాపాలన చూసుకుంటే మాత్రం చాలని చెప్పి నమ్మించారు. 2018 అక్టోబర్ నెలలో విజిట్ వీసాపై దుబాయ్ కు వెళ్లిన అయేషాను అక్కడ ఒక వ్యక్తి ఒక ఇంట్లో పనిలో చేర్పించాడు.
అక్కడ అయేషాను కొడుతూ ఉండటంతో ఆమె ఉద్యోగం ఇప్పించిన వ్యక్తిని కలిసి మరో ఇంటికి వెళ్లింది. అక్కడ అయేషాతో రోజుకు 20 గంటలు పని చేయించుకొని సరైన ఆహారం, వసతి కల్పించకపోవటంతో ఉద్యోగం ఇచ్చిన వ్యక్తిని కలిసి ఇండియా తిరిగి పంపించాలని అయేషా కోరింది. 2 లక్షల రూపాయలు ఇస్తే మాత్రమే ఇండియాకు పంపుతానని హైదరాబాద్ లోని ఇద్దరు మహిళలకు ఆ మొత్తం ఇచ్చానని ఆ వ్యక్తి చెప్పాడు. అయేషా భర్త ఎంబిటీ అనే సంస్థ సహాయంతో భారత రాయబార కార్యాలయంలో మాట్లాడి మహిళను భారత్ కు రప్పించారు. బాధిత మహిళ ఫిర్యాదు చేయటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!