మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజాకు 'హరివరాసనం' అవార్డు

- December 27, 2019 , by Maagulf
మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజాకు 'హరివరాసనం' అవార్డు

మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజాకు అవార్డులు, అరుదైన గౌరవాలు అందుకోవడం కొత్తేమీ కాదు. తాజాగా ఇళయరాజాకు కేరళ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక అవార్డును ప్రకటించింది. ఆయనకు 'హరివరాసనం' అవార్డును బహూకరించి, సత్కరించనున్నట్టు పేర్కొంది. జనవరి 15న శబరిమలలో అవార్డును అందజేయనున్నట్టు కేరళ సర్కారు ఓ ప్రకటనలో తెలిపింది.

అయ్యప్ప పవళింపు సేవలో 'హరివరాసనం' పాటను పాడతారన్న సంగతి తెలిసిందే. తనకు వచ్చిన అవార్డుపై ఇళరాజా స్పందించారు. అయ్యప్ప కరుణా కటాక్షాల కారణంగానే తనకు ఈ గుర్తింపు లభించిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ అవార్డు తనకి ప్రత్యేకమైనదని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com