యూఏఈ టూరిస్ట్ స్పాట్స్ లో రూల్స్ బ్రేక్.. 2 రోజుల్లో Dh31,500 ఫైన్
- December 29, 2019
రస్-అల్-ఖైమాలోని టూరిస్ట్ స్పాట్స్ లో ఎన్విరాన్మెంటల్ వయోలెటర్స్ సంఖ్య పెరుగుతోంది. పరిశుభ్రతకు యూఏఈ కంట్రీస్ అత్యంత ప్రధాన్యం ఇస్తాయి. ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తే ఫైన్ చెల్లించక తప్పదు. కానీ, కొన్నాళ్లుగా ఎన్విరాన్మెంటల్ వయోలెటర్స్ టూరిస్ట్ స్పాట్స్ ని గార్బేజ్ గా మారుస్తున్నారు. ప్రస్తుతం శీతాకాలం కావటంతో పర్యాటక ప్రాంతాలన్ని విజిటర్స్ తో సందడిగా మారాయి. ఎండలతో విసిగిపోయిన జనాలు శీతాకాలపు చల్లని గాలులను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే...నేచర్ ను ఎంజాయ్ చేస్తూనే అదే నేచర్ ను చెత్తతో నింపేస్తున్నారు. రూల్స్ కి విరుద్ధంగా చెత్తను కుప్పలుతెప్పలుగా పడేసి వెళ్తున్నారు. మౌంటెన్స్, డీసర్ట్ ఇలా పర్యాటక ప్రాంతాలను వేస్టేజ్ తో నింపేస్తున్నారు. వీకెండ్ లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోందని అధికారులు చెబుతున్నారు. కేవలం రెండు రోజుల్లోనే(శుక్ర, శనివారాల్లో) 63 మంది ఎన్విరాన్మెంటల్ వయోలెటర్స్ కి ఫైన్ వేశారు. ఒక్కొక్కరికి 500 దిర్హామ్ ల చొప్పున 31,500 దిర్హామ్ ల ఫైన్ కలెక్ట్ చేశారు. సాధారణ రోజుల్లో 10 మంది వరకు ఇలా ఎన్విరాన్మెంటల్ వయోలెటర్స్ ఉంటారని పాట్రోలింగ్ పోలీసు అధికారులు చెబుతున్నారు. వీకెండ్ లో మాత్రం ఇలాంటి రూల్ బ్రేకర్స్ సంఖ్య 63కు పెరుగుతుందని వివరించారు.
టూరిస్ట్ స్పాట్స్ లో క్యాంప్ కు వెళ్లండి, సైట్ సీయింగ్ ఎంజాయ్ చేయండి, నేచర్ ను ఆస్వాదించండి..కానీ, దేశం ఇమేజ్ దెబ్బతీసేలా చెత్తను మాత్రం పడేయకండి అని అధికారులు హెచ్చరిస్తున్నారు. పబ్లిక్ రోడ్స్, పార్క్స్, బీచెస్ లో ప్లాస్టిక్ బాటిల్స్, క్యాన్స్ ని పడేసి వెళ్తున్నారని..ఇలా పర్యావరణాన్ని పాడు చేసే వారి గురించి 8008118 కి డయల్ చేసి సమాచారం అందించాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







