డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌కు విరుగుడు కనిపెట్టిన ఆర్మీ అధికారి

- December 29, 2019 , by Maagulf
డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌కు విరుగుడు కనిపెట్టిన ఆర్మీ అధికారి

మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిగే ప్రమాదాలను నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే ఇలాంటి ప్రమాదాలను అరికట్టేందుకు కొత్త వ్యవస్థను కనిపెట్టారు ఓ ఆర్మీ అధికారి. మందుకొట్టి వాహనం నడపాలనుకుంటే ఇకపై కుదరదు. ఎందుకంటే మద్యం సేవిస్తే ఆ వాహనం అసలు స్టార్టే కాదు.

దేశవ్యాప్తంగా రోజుకు ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలు మద్యం సేవించి వాహనాలను నడపడం వల్లే జరుగుతున్నాయి. అయితే దీనికి ఇండియన్ ఆర్మీ అధికారి ఒకరు విరుగుడు కనిపెట్టారు. ఈ విధానంలో డ్రైవర్‌ గనక మద్యం సేవించి ట్రక్కు నడిపితే అది స్టార్ట్‌ అవ్వదు. అంతే కాదు....సీటు బెల్ట్‌ ధరించకపోయినా బండి కదలదు. కెప్టెన్‌ ఓంకార్‌ కాలే, అతని బృందం ఈ ఇంటిగ్రెటేడ్‌ వెహికల్‌ సేఫ్టీ సిస్టమ్‌ను రూపొందించింది.
ఇంటిగ్రెటేడ్‌ వెహికల్‌ సేఫ్టీ సిస్టమ్‌ను తొలిసారిగా భారతీయ సైన్యానికి చెందిన జబల్‌పూర్‌ వెహికిల్‌ ఫ్యాక్టరీలో రూపొందించిన వాహనాలపై ప్రయోగించారు. ఈ ప్రయోగం సక్సెస్‌ కావడంతో కెప్టెన్‌ ఓంకార్‌ కాలే బృందాన్ని ఆర్మీ ఉన్నతాధికారులు కొనియాడారు. దీనివల్ల ప్రమాదాలు చాలావరకు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు.

2018లో మత్తులో ఉండే డ్రైవర్లను గుర్తించేందుకు ఉత్తరాఖండ్ పరిశోధకులు కొత్త టెక్నాలజీ డెవలప్‌ చేశారు. తాగినపుడు డ్రైవింగ్‌ చేస్తే వాహనం కదలకుండా ఉండేలా రూపొందించారు. వ్యర్థ పదార్థాలు, గ్రాఫెన్‌తో ఓ పరికరాన్ని తయారు చేశారు. ఎసెటిక్‌ యాసిడ్‌లోకి ఇథైల్‌ ఆల్కహాల్ పంపడం ద్వారా ఇది పనిచేస్తుంది. అంతేకాదు...డ్రైవర్‌ మూడ్‌ సరిగా లేకపోయినా, ఫోన్లో మాట్లాడినా ఈ డివైస్ గుర్తిస్తుంది. వాహనం దానంతటదే నెమ్మదైపోతుంది.

* డ్రైవర్‌ మద్యం సేవిస్తే ట్రక్కు స్టార్ట్‌ కాదు
* సీటు బెల్ట్‌ ధరించకపోయినా బండి కదలదు
* ఇంటిగ్రెటేడ్‌ వెహికల్‌ సేఫ్టీ సిస్టమ్‌ను రూపొందించిన కెప్టెన్‌ ఓంకార్‌ కాలే
* కెప్టెన్‌ ఓంకార్‌ కాలే బృందాన్ని అభినందించిన ఆర్మీ ఉన్నతాధికారులు
* డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌పై ఉత్తరాఖండ్ పరిశోధకుల కొత్త టెక్నాలజీ
* వ్యర్థ పదార్థాలు, గ్రాఫెన్‌తో డివైస్‌ తయారు చేసిన పరిశోధకులు
* డ్రైవర్ తాగి ఉన్నా, ఫోన్ లో మాట్లాడినా తగ్గనున్న వాహనం స్పీడ్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com