డబ్బుల్లేక చదవలేనివారికి గుడ్ న్యూస్.. LIC స్కాలర్ షిప్‌లు
- December 30, 2019
ప్రభుత్వ సంస్ధ అయిన లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పోరేషన్ సంస్ధ చదవాలని కోరిక ఉండి చదవలేకపోతున్న విద్యార్ధుల కోసం సాల్కర్ షిప్ ను అందిస్తుంది. ఈ సాల్కర్ షిప్ 8వ తరగతి నుంచి పీజీ చదువుతున్న విద్యార్ధులకు వర్తిస్తుంది. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పోరేషన్(LIC) అనుబంధ సంస్ధ అయిన హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(HFL) పేద విద్యార్ధులకు 'విద్యాధాన్ స్కాలర్ షిప్' పేరుతో రూ.30 వేల వరకు అందిస్తుంది.
దరఖాస్తు చేయడానికి చివరి తేది డిసెంబర్ 31,2019. గుర్తింపు పొందిన సంస్ధల్లో చదువుతున్న విద్యార్ధులు మాత్రమే ఈ సాల్కర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవాలి. ఈ సాల్కర్ షిప్ కి దరఖాస్తు చేసే విద్యార్ధుల కుటుంబ సంవత్సర ఆదాయం రూ.3 లక్షల లోపు ఉండాలి.
సాల్కర్ షిప్ అర్హతలు ఇవే:
> 8వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్ధులు అంతకుముందు తరగతిలో 65 శాతం మార్కులతో పాస్తే ఉండాలి. వారికి సంవత్సరానికి రూ.10 వేలు స్కాలర్ షిప్ ఇస్తుంది.
> ఇంటర్ ఫస్టియర్, సెకండియర్, ఐటీఐ, డిప్లామా, పాలిటెక్నిక్ విద్యార్ధులు మాత్రం 10వ తరగతిలో 65 శాతం మార్కులతో పాస్తే ఉండాలి. వారికి సంవత్సరానికి రూ.15 వేలు స్కాలర్ షిప్ ఇస్తుంది.
> డిగ్రీ, గ్రాడ్యుయేట్ విద్యార్ధులు ఇంటర్ లో 65శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. వారికి సంవత్సరానికి రూ.20 వేలు స్కాలర్ షిప్ ఇస్తుంది.
> పోస్ట్ గ్రాడ్యుయేట్ లో చేరిన విద్యార్ధులు డిగ్రీలో 65శాతం మార్కులతో పాస్ కావాలి. వారికి సంవత్సరానికి రూ.30 వేలు స్కాలర్ షిప్ ఇస్తుంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు