దొంగతనం కేసులో ఇద్దరి అరెస్ట్
- December 31, 2019
బహ్రెయిన్: ముహరాక్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ డైరెక్టర్ జనరల్ వెల్లడించిన వివరాల ప్రకారం డైరెక్టరేట్ పోలీస్, ఇద్దరు వ్యక్తుల్ని దొంగతనం కేసులో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు వ్యక్తులు, ఓ ప్రత్యేకావసరాలు గల వ్యక్తిని అటకాయించి, అతని వద్ద నుంచి డబ్బు అలాగే బ్యాక్ కార్డుల్నీ దొంగిలించినట్లు అధికారులు వెల్లడించారు. బాధిత వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు, ఇద్దరు అనుమానితుల్ని పట్టుకున్నారు. తొలుత ఓ వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు, అతని దగ్గరనుంచి లభించిన సమాచారంతో ఈ కేసులో పాల్గొన్న మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేస్తామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..