సౌదీ రిజిస్టర్డ్ స్పోర్ట్స్ కార్ స్మగ్లింగ్
- December 31, 2019
కువైట్ సిటీ: జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్‌కి చెందిన ఇద్దరు అధికారులు, ఇద్దరు కువైటీలను స్మగ్లింగ్ కేసులో పోలీసులు సెక్యూరిటీ అథారిటీస్‌కి అప్పగించడం జరిగింది. నిందితులు, ఓ ఖరీదైన స్పోర్ట్స్ కార్‌ని దేశంలోకి స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించినట్లు అభియోగాలు మోపబడ్డాయి. అల్ సాల్మి బోర్డర్ పాయింట్ ద్వారా నిందితులు సౌదీ రిజిస్టర్డ్ స్పోర్ట్స్ కారుని దేశంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. నిందితులు కువైటీ నెంబర్ ప్లేట్స్‌ని వాహనానికి ముందూ వెనుకా అతికించారు. కారు ఓనరు నుంచి కారుని బలవంతంగా లాక్కున్నారనే ఆరోపణలు వచ్చాయి. దాంతో, బోర్డర్ వద్దనున్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీల్ని పరిశీలించగా, ఈ ఘటన వెలుగు చూసింది. ఇద్దరు కస్టమ్స్ అధికారులు, కారు నడుపుతున్న వ్యక్తి స్నేహితుడు ఈ స్మగ్లింగ్‌లో పాలుపంచుకున్నట్లు తేలడంతో వారిని అరెస్ట్ చేసి, సాల్మి పోలీస్ స్టేషన్‌కి వారిని రిఫర్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







